Okka Chinukulo

M: ఒక్క చినుకులో ఎన్ని మేఘాలో
ఒక్క వెదురులో ఎన్ని రాగాలో
ఒక్క చినుకులో ఎన్ని మేఘాలో
ఒక్క వెదురులో ఎన్ని రాగాలో
ఎన్ని వేల సార్లు నే వర్షంలో నడిచా
నేడు గుండె తడిసెనెందుకో...
ఈ వేళలాగా ఇన్నాళ్లు పాడలేదే
ఈ పల్లవిచ్చి వెళ్లెనెవ్వరో
F: ఒక్క చినుకులో ఎన్ని మేఘాలో
ఒక్క అడుగులో ఎన్ని దూరాలో
ఒక్క చినుకులో ఎన్ని మేఘాలో
ఒక్క అడుగులో ఎన్ని దూరాలో
ఎన్ని వేల సార్లు ఈ వర్షంలో తడిసా
నేడు చిన్న శోకమెందుకో...
ఈ వేళ లాగా ఇన్నాళ్లు పాడలేదే
ఈ పల్లవించు వేధనేమిటో

F: మనసుని బతిమాలానే
ఎన్నో మరిపించావే ఈ క్షణం
మరిపించావేమంటూ...
M: మెరుపుకి కబురంపానే
తననే మైమరపించి ఈ క్షణం
ఓ అద్భుతం అంటూ...
అమృత ఘడియలు కలబోసి
ఆకాశాన్నే వడబోసి
ఈ నిమిషాన్నే చిలికిందెవ్వరో...
F: వేదన వీణలు శృతి చేసి
వెన్నెల వెలుగులు విరిచేసి
ఈ వేసవి విరబూసిందెవ్వరో...
F: Haa...
M: Oh...
F: oh...
M: Oh...
F: Haa
M: Oh...
Haaa...
F: హరివిల్లుల హృదయంలో
ఈ నలుపుకి గెలుపేదో
తెల్లగా నను మార్చునో లేదో...
M: తెల తెల్లని హృదయంలో
ఈ రంగుకు పేరేదో నన్నిలా
బ్రతికించు స్వరమేదో...
హో... బురదను వలిచిన కలువందo
హృదయం ఒలికెను మకరందం...
సంద్రం ఆలలను నదిలో కలిపారే... కలిపారే...
F: చినుకుని మోసే చిగురాకే
ఏదో నిమిషం విడుచునులే
ఈ చిన్ని సత్యం మరిచానే...
F: ఒక్క చినుకులో ఎన్ని మేఘాలో
ఒక్క అడుగులో ఎన్ని దూరాలో
M: ఈ వేళలాగా ఇన్నాళ్లు పాడలేదే
ఈ పల్లవిచ్చి వెళ్లెనెవ్వరో...
F: Rabba rabba...
Rabba rabba...
Rabba rabba...
Rabba rabba...
Rabba rabba...
Rabba rabba...
Rabba rabba.



Credits
Writer(s): Shree Mani
Lyrics powered by www.musixmatch.com

Link