Kotthaga Kotthaga

ఓ కొత్తగా కొత్తగా రెక్కలొచ్చినట్టుగా
క్షణముకొక్క నిముషమల్లె గడుపుదాం పద
ఓ వింతగా వింతగా మంత్రమేసినట్టుగా
నిమిషమొక్క గంటలాగ గడుపుదాం పద
ఓ వేగమే
కాస్త పెంచనా
గంటకిన్ని పూటలంటు మూటకట్టనా పూటకిన్ని రోజులంటూ పంచి పెట్టనా
రోజుకొక్క వారమంటూ నడక మార్చనా ప్రేమ పంచడంలో నిన్ను మించనా
ఎండైనా (ఎండైనా)
వానైనా (వానైనా)
మన తీరే ఆగేనా
నిన్నైనా (నిన్నైనా)
రేపైనా (రేపైనా)
అరక్షణమే ఇకపైనా
ఏ కొత్తగా కొత్తగా రెక్కలొచ్చినట్టుగా
క్షణముకొక్క నిముషమల్లె గడుపుదాం పద
వింతగా వింతగా మంత్రమేసినట్టుగా
నిమిషమొక్క గంటలాగ గడుపుదాం పద
ఓ ఎక్కడున్నదో నాకు నచ్చబోయే పిల్ల అంటూ
ఎప్పుడొచ్చి నన్ను కోరి చేరుతుందో అంటూ
ఊహించుకున్న నిమిషమెక్కడున్నా నిన్ను తీసుకెళ్ళి చూపనా
నిన్ను చూడగానే నా మొదటి భావనేంటో
నిన్ను చేరలేక నేను పడ్డ వేదనేంటో
చెప్పలేనిదంటూ నిన్నే చూడమంటూ ఆ ఘడియలోకి లాగనా
కలుసుకోని వేళలన్నీ లెక్కగట్టనా మనం కలుసుకున్న వేళ వేలికంటగట్టనా
అలసిపోవడాన్ని తీసి పక్కనెట్టనా నిన్ను తెలుసుకోవడంలో తేలనా
ఎండైనా (ఎండైనా)
వానైనా (వానైనా)
మన తీరే ఆగేనా
నిన్నైనా (నిన్నైనా)
రేపైనా (రేపైనా)
అరక్షణమే ఇకపైనా
Sunrise చూడాలి నీ పక్కనుంటూ
Moonlight తాకాలి నీ ఊసులింటూ
Sun, moon ని తెచ్చి పక్క పక్కనెట్టే time వేస్టే చేయక
నీ రూపు చూడాలి రెప్ప విప్పగానే
నువ్వు జోల పాడాలి రాతిరవ్వగానే
రేయి పగలు తెచ్చి ఒక్కచోట కట్టేయి ఎడబాటే లేదిక
పక్కనోళ్ళ time కుడా దొంగిలించనా పేర పెట్టుకున్న కలలు వరసబెట్టి తీర్చనా
లేకపోతే లోకమంతా కాలమాపనా ఇన్నినాళ్ళ ప్రేమ వెలితి నింపనా
ఎండైనా (ఎండైనా)
వానైనా (వానైనా)
మన తీరే ఆగేనా
నిన్నైనా (నిన్నైనా)
రేపైనా (రేపైనా)
అరక్షణమే ఇకపైనా



Credits
Writer(s): Devi Sri Prasad, P Girish
Lyrics powered by www.musixmatch.com

Link