Emo Emo

ఏమో ఏమో ఇది ప్రేమో
నాలో నిజం రుజువేమో
నువ్వు నేను ఒకటేమో
మళ్ళీ పుట్టి కలిసామో

శ్వాసకు ఏమయ్యింది
నీ ప్రాణంలో దాగుంది
ఈ నేలకు ఏమయ్యింది
ప్రతి చోటూ నీదన్నది

నిన్నిక చూడని క్షణం ఇలా
పగలైనా కలలే కనేంతలా
కన్నుల ముందర పండగలా
మనసంతా నువ్వే ఇదేంటిలా

- - - Music - - -

నీ పరిచయమైన ఆ క్షణం
నను నీలో చూపింది
ఆ పరవశం ఇప్పుడు ప్రతీక్షణం
నా మనసు అడుగుతోంది

నీ పరిచయమైన ఆ క్షణం
నను నీలో చూపింది
ఆ పరవశం ఇప్పుడు ప్రతీక్షణం
నా మనసు అడుగుతోంది

ఇన్నాళ్లు ఎలా నేను గడిపా
నువు లేక అలా ఒంటరై
అనుకుంటా నిన్నే కలవరించే
ప్రతిసారీ...

నిన్నిక చూడని క్షణం ఇలా
పగలైనా కలలే కనేంతలా
కన్నుల ముందర పండగలా
మనసంతా నువ్వే ఇదేంటిలా

- - - Music - - -

నీ ఊసులు నిండిన జ్ఞాపకం
నా గుండె చప్పుడైంది
ఆ నింగికి నేలకు మధ్యన
నా ఒళ్ళు తేలుతుంది

నీ ఊసులు నిండిన జ్ఞాపకం
నా గుండె చప్పుడైంది
ఆ నింగికి నేలకు మధ్యన
నా ఒళ్ళు తేలుతుంది

నా వైపే నేనే తరుముతుంటా
నీతోనే ఉంటూ నీడనై
నిలువెల్లా నిన్నే నింపుకున్నా
నీవాన్నై...

గౌతమీ...
నా ప్రాణమైన చెలిమి
ఓ గౌతమీ...
నూరేళ్ల ప్రేమ వరమీ...



Credits
Writer(s): Ajay Patnaik
Lyrics powered by www.musixmatch.com

Link