Kanupapaku

మది తెలుపుతున్నది మనమొక్కటేనని
ఈ దూరమన్నది అసలడ్డుకాదని

కనుపాపకు ఇది తెలుసా
నీ శ్వాసకు ఇది తెలుసా
కనుగొందా ఈ వరసా
గుర్తించిందా మనసా
నిను చూస్తున్నా ఏం చేస్తున్నా
నీడై గమనిస్తున్నా
నీ వెనకే వస్తున్నా
తనువులు విడిగా ఉన్నా హృదయం ఒకటే కాదా
నిన్ను నన్ను ఏకం చేసే వంతెన వలపేగా
నిన్న మొన్న ఎపుడైనా ఈ అనందమే చూసానా
నిన్ను నన్ను కలిపింది ఆ దైవమే అనుకోనా

కనుపాపకి ఇది తెలుసా
కనుగొందా ఈ వరసా

పెదవిప్పలేని మాటైనా
కనురెప్పతోటె తెలిపైనా
ఎవరొప్పుకోను అంటున్నా
యద చప్పుడసలు ఆగేనా
ఎదుటే కదలాడుతున్నది ప్రాణం విడిగా
ఒకటై నడవాలి చివరికి నీడై ఒ జతగా
ఇంతమందిలో ఒకడై ఉన్నా
నిను వింతగా కనిపెడుతున్నా
ఎంతమందితో నే కలిసున్నా
నీ చెంతకే చేరగ కలగన్నా

నిన్న మొన్న ఎపుడైనా ఈ అనందమే చూసానా
(ఆమ్మో మాకు తెలుసమ్మా, మా ముందే ఇది మీకు తగునా)

కనుపాపకి ఇది తెలుసా
నీ శ్వాసకి ఇది తెలుసా

చిరు పంజరాన నేనున్నా
చిరునవ్వుతోనే చూస్తున్నా
తొలిపొద్దు జాడ తెలిసున్నా
సరిహద్దు దాటలేకున్నా
కలలే మరి భారమైనవి నిజమై తెలుసా
భారం ఎన్నాళ్ళో ఉండదు నను నమ్మే మనసా
నమ్మి నిన్నే నీలొ సగమైన కద
గుండెలోన నిన్ను దాచుకున్న ఇలా
గుండె చాటు గుట్టు తెలిసున్నా
అది విప్పి చెప్పలేరుగా ఎవరైనా

నిన్న మొన్న ఎపుడైనా ఈ అనందమే చూసానా
ఎన్నో ఎన్నో కధలున్నా నీ కావ్య వింత ఎపుడైనా

కనుపాపకి ఇది తెలుసా
నీ శ్వాసకి ఇది తెలుసా
నిను చూస్తున్నా ఏం చేస్తున్నా
నీడై గమనిస్తున్నా
నీ వెనకే వస్తున్నా



Credits
Writer(s): Kandikonda, Chakri
Lyrics powered by www.musixmatch.com

Link