Entha Varaku

ఎంత వరకు ఎందు కొరకు
ఇంత పరుగు అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే
బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు ఉందే
గుర్తు పట్టే గుండెనడుగు
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక
ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతి చోట నిను నువ్వే
కలుసుకొని పలకరించుకోవా

ఎంత వరకు ఎందు కొరకు
ఇంత పరుగు అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే
బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు ఉందే
గుర్తు పట్టే గుండెనడుగు
కనపడే వెన్నెన్ని కెరటాలు
కలగలిపి సముద్రమంటారు
అడగరేం ఒక్కొక్క అల పేరు
మనకిలా ఎదురైన ప్రతివారు
మనిషనే సంద్రాన కెరటాలు
పలకరే మనిషీ అంటే ఎవరూ
సరిగా చూస్తున్నదా నీ మది గదిలో
నువ్వే కదా ఉన్నది
చుట్టూ అద్దాలలో విడి విడి రూపాలు
నువ్వు కాదంటున్నది
నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు
నీ చూపుల్లో లేదా
మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే
నువ్వే కాదా కాదా
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక
ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతి చోట నిను నువ్వే
కలుసుకొని పలకరించుకోవా
మనసులో నీవైన భావాలే
బయట కనిపిస్తాయి దృశ్యాలై
నీడలు నిజాల సాక్ష్యాలే
శత్రువులు నీలోని లోపాలే
స్నేహితులు నీకున్న ఇష్టాలే
ఋతువులు నీ భావ చిత్రాలే
ఎదురైన మందహాసం
నీలోని చెలిమి కోసం
మోసం రోషం ద్వేషం
నీ మకిలి మతికి భాష్యం
పుటక చావు రెండే రెండూ
నీకవి సొంతం కావు పోనీ
జీవిత కాలం నీదే నేస్తం
రంగులు ఏం వేస్తావో కానీ

తారరరనే తారరరనే తారరరనే తారారనే
తారరరనే తారరరనే తారరేనా రారరనే
తారరరనే తారరరనే తారరేనా రారరనే



Credits
Writer(s): E.s. Murthy, R. Anil
Lyrics powered by www.musixmatch.com

Link