Laali Laali

లాలి లాలి
లాలి లాలి
బజ్జోరా నా బుజ్జాయి
లాలి లాలి
లాలి లాలి
నిదురపో నా బంగారి
చిట్టి తల్లిని నిదురపుచ్చే
అమ్మ నేనై పాడనా
అమ్మ కోసం అమ్మై వచ్చిన
నీకు జోల పాడనా
నిదురపోయి లోకమంతా
కనులుమూసే వేళ
కలతలన్నీ కరిగిపోయి
కలలు చేరే వేళ
లాలి లాలి
లాలి లాలి
బజ్జోరా నా బుజ్జాయి
లాలి లాలి
లాలి లాలి
నిదురపో నా బంగారి
దివిలోనంట
బంగరు స్వర్గమంట
భువిలోనంట
రంగులలోకమంట
వెలుగులన్నీ దీపాలై
మా ముంగిటే నిలిచెలే
అంతులేని ఆనందాలే
గుండెలో ఒదిగేలె
ఏ బంధమంటు లేని నాకు
ఆత్మ బంధువు దొరికెలే
ఆ రాముడై నా తోడునిలిచి
దీవెనే ఇచ్చెలే
ఈ జన్మకీ నువ్వుతోడుగా
ఉండగా చాలులే
లాలి లాలి
లాలి లాలి
బజ్జోరా నా బుజ్జాయి
లాలి లాలి
లాలి లాలి
నిదురపో నా బంగారి
కలలోనంట
వింతల లోకమంట
ఆ లోకానికి నువ్వు
రాణిలా ఏలమంట
నీకోసం జాబిలే
బంతిగా మారులే
వెన్నెలే నీ తోడుగా
నేస్తమై చేరులే
మబ్బులన్నీ పానుపల్లే
నిన్ను ఊయలలూపగా
చుక్కలన్నీ నీ చెక్కిల్లకు
మెరుపులై చేరగా
ఆ కన్నయ్యే నీ కోసం
వేణువై పాడగా
లాలి లాలి
లాలి లాలి
బజ్జోరా నా బుజ్జాయి
లాలి లాలి
లాలి లాలి
నిదురపో నా బంగారి



Credits
Writer(s): Anil Gopi Reddy
Lyrics powered by www.musixmatch.com

Link