Ananda Paramanda

ఆనంద పరమానంద పరమానంద
ఆనంద పరమానంద పరమానంద
జగతి నీదే జన్మ నీదే జగదానంద
ఆట నీదే పాట నీదే ఆత్మానంద
నిసరి సరిగ మమరిస నిసరిస దనిపమ గమరిస ఆనంద
పరమానంద పరమానంద

మాయల వలలోన జీవుల బంధించి మురియుట ఒక ఆట ధర్మానంద
ఎదలో గరళాన్ని మధురసుధగా మార్చి నవ్వించుటొక ఆట మోహానంద
పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట

పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట
ప్రాణ ధాత బ్రహ్మ రాత నీ మాయేరా
ఆది నీదే, అంతు నీదే అమరానంద
నిసరి సరిగ మమరిస నిసరిస దనిపమ గమరిస ఆనంద
పరమానంద పరమానంద

గంగను తలగాంచి ధరణికి మరళించి స్వర్గంగా మార్చావు మధురానంద
పుత్రుడ్ని కరుణించి పున్నామ నరకాన్ని లేకుండా చేస్తావు స్వర్గానంద
దాన ధర్మాల ఫలితాలే పసివాళ్ళు

దాన ధర్మాల ఫలితాలే పసివాళ్ళు
కన్న వాళ్ళ కర్మలేరా పుణ్యానంద
కర్త నువ్వే, కర్మ నువ్వే కరుణానంద
నిసరి సరిగ మమరిస నిసరిస దనిపమ గమరిస ఆనంద
పరమానంద పరమానంద
పరమానంద పరమానంద



Credits
Writer(s): Hamsalekha, Visvanatha Sastry
Lyrics powered by www.musixmatch.com

Link