Amma Andani

అమ్మ అందని త్యాగం
కోటి దైవాల రూపం
కదిలే కోవెల నీ దేహం
నోమె నోచే జన్మం
పువ్వై పూసే ప్రాణం
అమ్మ నువ్వే ఆ రూపం
దాయి దాయి జోలపాడి
కనుపాపై కాచేనే
ముత్యమంతా ముద్దు చేసే
ఆడి పాడి హాయిలోనే
తల్లి ప్రేమే పంచేలే
ఆరారు కాలాలు పూచే పున్నాలే

(ఓ, తందారినానే
తందేనా తందె తానానే
తందానే
దెఏఏ
తందేనా తందె తానానే)

పూసే పొద్దే దీపం
వీచే గాలే శోకం
సాగే శూన్యం నీ గమ్యం
దోషం లేదే పాపం
దైవం ఇచ్చే శాపం
మోసే భారం నీ కోసం
రేయే రేపాయి నీ గూడు నిండేనా
నిదరే రాని వేళా
నావే నదిలో నడి ఒడ్డే చేరేనా
నేరం నీదేం కాదె

దీపం కన్నె దాచి
చూపాయి నిన్నే కాచి
వెలిగే వేకువ సింధూరం
నింగి నెలే నేస్తం
నీవై నిండే లోకం
నీతో జన్మే సావాసం
ఎదో బాధే యద గంగై పొంగేనా
నీడే తోడై పోయే
మోసే భారం మరి దూరం ఎంతైనా
ఆశే శ్వాసై సాగే

(ఓ, తందారినానే
తందేనా తందె తానానే
తందానే
దెఏఏ
తందేనా తందె తానానే)



Credits
Writer(s): Amaresh Kuchinerla, Pavan Shesha
Lyrics powered by www.musixmatch.com

Link