Syamasundaraa - Male Vocals

శ్యామసుందరా ప్రేమ మందిరా
నీ నామమే వీనుల విందురా
నీ నామమే వీనుల విందురా శ్యామసుందరా

ఆణువణువూ నీ అలయమేరా నీవే లేని చోటు లేదురా
ఆణువణువూ నీ అలయమేరా నీవే లేని చోటు లేదురా
నేనని నీవని లేనే లేదు నీకు నాకు భేదము లేదు
శ్యామసుందరా ప్రేమ మందిరా

సుఖదుఃఖాలకు నిలయం దేహం ఈ దేహముపై ఎందుకె మొహం
అహము విడిచితే ఆనందమురా అన్నిట మిన్నా అనురాగమురా
భక్త తుకారాం గానము వింటే తొలగిపోవును శోకంరా
శ్యామసుందరా ప్రేమ మందిరా

సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా
సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా
అలవాటైతే విషమే అయినా హాయిగ త్రాగుట సాధ్యమురా
హాయిగ త్రాగుట సాధ్యమురా
సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా
కాల సర్పమును మెడలో దాల్చి పూల మాలగా తలచవచ్చురా
పూల మాలగా తలచవచ్చురా
ఏకాగ్రతతో ధ్యానము చేసి లోకేశ్వరునే చేర వచ్చురా
లోకేశ్వరునే చేర వచ్చురా
దాస తుకారాం తత్వ బోదతో తరించి ముక్తిని పొందుమురా
తరించి ముక్తిని పొందుమురా
సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా

అనిగిమనిగి నుండే వాడే అందరిలోకి ఘనులు
అనిగిమనిగి నుండే వాడే అందరిలోకి ఘనులు
డొద్దమాణులను కూల్చు తుఫాను గడ్డిపరకను కదల్చ గలదా
కదల్చ గలదా
చిన్న చీమలకు చెక్కెర దొరకెను గొప్ప మనిషికి ఉప్పే కరువు
ఉప్పే కరువు
అనుకువ కోరే తుకారాముని మనసే దేవుని మందిరము
మనసే దేవుని మందిరము
అనిగిమనిగి నుండే వాడే అందరిలోకి ఘనులు

పడవెళ్లి పోతుందిరా ఆ... ఆ... ఓ...
పడవెళ్లి పోతుందిరా ఓ మానవుడా దరిచేరే దారేదిరా
ఈ జీవితము కెరటాల పాలాయెరా
పడవెళ్లి పోతుందిరా...
తల్లిదండ్రి అతడే నీ ఇల్లువాకిలతడే
తల్లిదండ్రి అతడే నీ ఇల్లువాకిలతడే
ఆ పాండురంగడున్నాడురా...
నీ మనసు గోడు వింటాడురా నీ భారమతడు మోసేనురా
ఓ యాత్రికుడా నిన్నతడే కాసేనురా
పడవెళ్లి పోతుందిరా...
బుడగవంటి బ్రతుకు ఒక చిటికెలోనే చితుకు
బుడగవంటి బ్రతుకు ఒక చిటికెలోనే చితుకు
ఇది శాశ్వతమని తలచేవురా నీ వెందుకని మురిచేవురా
నువు దరిచేరే దరి వెతకరా
ఓ మానవుడా హరినామం మరవవద్దురా
పడవెళ్లి పోతుందిరా...



Credits
Writer(s): Thierry David
Lyrics powered by www.musixmatch.com

Link