Nee Navve - From "Soggade Chinni Nayana"

నీ నవ్వే హాయిగా వుంది
ఈ ఊసే కొత్తగా వుంది
ఇన్నినాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది
నీ మాటే నా మౌనంలో
నీ శ్వాసే నా గుండెల్లో
నన్ను నేను చూసుకుంటా అచ్చంగా నీలో
ఏంటండి సారూ మీరేనా మీరు
ఈ ప్రేమలో మహ ముద్దుగున్నారు

నీ నవ్వే హాయిగా వుంది
ఈ ఊసే కొత్తగా వుంది
ఇన్నినాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది

ప్రతిక్షణమూ మనసుపడి
కలలుకనే నేనే అర్థం కానా
రుసరుసలే చూపిస్తున్నా
నను దూరం చేస్తూవున్నా
నాకోసం ఓ క్షణమయినా
ఆలోచిస్తే చాలన్నా

నిన్నల్లో ఊపిరి నువ్వే
నా రేపటిలో ఆయువు నువ్వే
నీకోసమే నే మారనా నీ తోడిలా నా తోడుగా ఉంటే

ఓ' నీ నవ్వే హాయిగా వుంది
ఈ ఊసే కొత్తగా వుంది
ఇన్నినాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది

తడబడితే పెదవులిలా
కనపడదా నాలో నీపై ఆశ
నీ చల్లని మాటల కోసం
లోలోపల ఎదురే చూసా
నీ ముద్దుముచ్చట కోసం
పడిగాపులు ఎన్నో కాసా

చుక్కల్లో జాబిలి నువ్వే
నా గుండెల్లో వెన్నెల కావే
నీ శ్వాసలో ఈ గాలిలా నూరేళ్ళిలా నే వుండిపోతాలే

నీ నవ్వే హాయిగా వుంది
ఈ ఊసే కొత్తగా వుంది
ఇన్నినాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది
నీ మాటే నా మౌనంలో
నీ శ్వాసే నా గుండెల్లో
నన్ను నేను చూసుకుంటా అచ్చంగా నీలో
ఏంటండి సారూ మీరేనా మీరు
ఈ ప్రేమలో మహ ముద్దుగున్నారు



Credits
Writer(s): Balaji, Anup Rubens
Lyrics powered by www.musixmatch.com

Link