Oohalu Oorege Gaalanthaa (From "Sammohanam")

ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేళంటా

ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేళంటా

ఈ సమయానికి తగుమాటలు ఏమిటో
ఎవ్వరినడగాలట

చాలా పద్దతిగా భావం తెలిసి
ఏదో అనడం కంటే
సాగే కబుర్లతో కాలం మరిచి
సరదా పడదామంతే

ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేళంటా

పరవశమా మరీ ఇలా
పరిచయమంత లేదుగా
పొరబడిపోకు అంతలా
నను అడిగావా ముందుగా

నేనేదో భ్రమలో ఉన్నానేమో
నీ చిరునవ్వే ఏదో చెబుతోందని
అది నిజమే అయినా
నాతో అనకూ నమ్మలేనంతగా

ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేళంటా

తగదు సుమా అంటూ ఉంటే
తలపు దుమారం ఆగదే
తొలి దశలో అంతా ఇంతే
కలవరపాటు తేలదే

ఈ బిడియం గడియే తెరిచేదెపుడో
నా మదిలో మాట తెలిపేందుకు
ఇదిగో ఇదదే అనుకోమనకు
ఆశలే రేపగా

ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేళంటా

ఈ సమయానికి తగుమాటలేమిటో
ఎవ్వరినడగాలట

చాలా పద్దతిగా భావం తెలిసి
ఏదో అనడం కంటే
సాగే కబుర్లతో కాలం మరిచి
సరదా పడదామంతే

చాలా పద్దతిగా భావం తెలిసి
ఏదో అనడం కంటే
సాగే కబుర్లతో కాలం మరిచి
సరదా పడదామంతే



Credits
Writer(s): Vivek Sagar, Sirivennela Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link