O Sari Try Chei

ఓ చిన్న నవ్వు చాలు
చెంగు చెంగుమంటు చిందులేయదా జీవితం (ఛల్ హాట్)
ఉన్న ఒక life గాలిపటం type ఎగిరితేనే సంబరం

ఏ గుండె చప్పుడు వద్దనదు ఎప్పుడూ సంతోషం ఇస్తానంటే
ఏ కన్ను ఎన్నడూ కాదనదు తమ్ముడు రంగులు నింపేస్తానంటే
ఓ సారి try చేయ్
ఓ సారి try చేయ్

హేయ్ హేయ్...
హేయ్ మామా హేయ్ మామా
హేయ్ మామా మామా మామా
హేయ్ మామా హేయ్ మామా హేయ్ మామా మా
హొయ్ మామా హొయ్ మామా
ఓ సారి try చెయి మామా
హొయ్ మామా హొయ్ మామా హొయ్ మామా మా

సూరీడే నాకు బాబాయి వరస
పొద్దున్నే వచ్చి లేరా అంటాడు
ఆ జాబిలమ్మే నాకు చిన్నమ్మ
పొద్దు పోయింది పడుకోమంటుంది
నేల మా తల్లంట నింగే మా నాన్నంట
మెరిసే ఆ చుక్కలనే అక్కలు అనుకుంటా
వానే మా అన్నంట గాలే నా చెల్లంట
మొత్తం ఈ లోకాన్నే సొంతం అనుకుంటా

ఇట్టా అనుకుంటే ఎవ్వడికైనా
Set అయిపోదా పెద్ద family
ముడేసుకుంటూ కలిపేసుకుంటే ఉప్పొంగి పోదా చిన్న జిందగి
ఓ సారి try చెయ్
ఓ సారి try చెయ్
ఓ సారి try చెయ్
ఓ సారి try చెయ్

ఎంతో పోగేశాం ఎంతో వెనకేశాం
ఇంకేం కావాలి అంటే ఎట్టాగా
నీతో మాటాడే మనిషే కరువైతే
నీకెంత ఉన్నా అంతా మట్టేగా

చేరిపేద్దాం గీతల్ని మూసేద్దాం గోతుల్ని
గెలిచేద్దాం మనుసుల్ని అంత మనమేగా
తెంచేద్దాం కంచెల్ని కూల్చేద్దాం గోడల్ని
కలిపేద్దాం అందర్నీ మనసే వంతెనగా

పక్కోడి కష్టం నాకేంటి నష్టం
అనుకోడమేగా పెద్ద tragedy
మనిషైతే చాలే చుట్టం అవ్వాలా
ఏదైనా సాయం చెయ్యడానికి
ఓ చిన్న నవ్వు చాలు
చెంగు చెంగుమంటూ
చిందులేయదా జీవితం
అరే ఉన్న ఒక life గాలిపటం type ఎగిరేతేనే సంబరం
ఓ సారి try చెయ్
ఓ సారి try చెయ్
ఓ సారి try చెయ్
ఓ సారి try చెయ్
ఓ సారి try చెయ్
ఓ సారి try చెయ్
ఓ సారి try చెయ్
ఓ సారి try చెయ్



Credits
Writer(s): Bhaskarabhatla, Shakthikanth Karthick
Lyrics powered by www.musixmatch.com

Link