Chitram Bhalare

చిత్రం ఆయ్ భళారే విచిత్రం
చిత్రం అయ్యారే విచిత్రం
నీ రాచనగరకు రారాజును రప్పించుటే విచిత్రం
పిలువకనే ప్రియవిభుడే విచ్చేయుటే విచిత్రం
చిత్రం అయ్యారే విచిత్రం
హ హ చిత్రం ఆయ్ భళారే విచిత్రం

రాచరికపు జిత్తులతో ఓ ఓ ఓ ఓ ఓ
రణతంత్రపుటెత్తులతో ఓ ఓహో ఓ ఓ ఓ ఓ
రాచరికపు జిత్తులతో రణతంత్రపుటెత్తులతో
సదమదమవు మామదిలో మదనుడు సందడి సేయుట సిత్రం
ఆయ్ భళారే విచిత్రం

ఎంతటి మహరాజయినా ఆ హా ఆ ఆ ఆ ఆ ఆ
ఎంతటి మహరాజయినా ఎప్పుడో ఏకాంతంలో
ఎంతో కొంత తన కాంతను స్మరించుటే సృష్టిలోని చిత్రం
ఆయ్ భళారే విచిత్రం
అయ్యారే విచిత్రం

బింభాధర మధురిమలూ ఊ ఊ ఊ
బిగికౌగిలి ఘుమఘ్మలూ ఊ ఊ ఆ ఆ ఆఅ ఆ
బింభాధర మధురిమలు బిగికౌగిలి ఘుమఘుమలు
ఇన్నాళ్ళుగా మాయురే మేమెరుగకపోవటే చిత్రం
ఆయ్ భళారే విచిత్రం

ఆ ఆ ఆఅ హా హా హ హ ఆ ఆ ఆ
వలపెరుగని వాడననీ ఈ ఈ ఈ ఈ
వలపెరుగని వాడననీ పలికిన ఈ రసికమణి
తొలిసారే ఇన్ని కలలు కురిపించుట హ హవ్వా
నమ్మలేని చిత్రం మూ అయ్యారే విచిత్రం
ఆయ్ భళారే విచిత్రం
అయ్యారే విచిత్రం అయ్యారే విచిత్రం మూ అయ్యారే విచిత్రం



Credits
Writer(s): Dr. C Narayana Reddy, Pendyalaya Nageswara Rao
Lyrics powered by www.musixmatch.com

Link