Kalyanam Kanundhi

కళ్యాణం కానుంది కన్నె జానకికి
(కళ్యాణం కానుంది కన్నె జానకికి)
వైభోగం రానుంది రామ చంద్రుడికి
(వైభోగం రానుంది రామ చంద్రుడికి)
దేవతలే దిగి రావాలి జరిగే వేడుకకి
(రావమ్మా సీతమ్మ సిగ్గు దొంతరలో)
(రావయ్యా రామయ్య పెళ్లి శోభలతో)

వెన్నెల్లో నడిచే మబ్బుల్లాగా
వర్షంలో తడిసే సంద్రంలాగా
ఊరేగే పువ్వుల్లో చెలరేగే నవ్వుల్లో
అంతా సౌందర్యమే
అన్నీ నీ కోసమే
వెన్నెల్లో నడిచే మబ్బుల్లాగా
వర్షంలో తడిసే సంద్రంలాగా

నాలో ఎన్ని ఆశలో
అలల్లా పొంగుతున్నవి
నీతో ఎన్ని చెప్పినా
మరెన్నో మిగులుతున్నవి
కళ్లల్లోనే వాలి నీలాకాశం
అంతా ఎలా ఒదిగిందో
ఆ గగనాన్ని ఏలే పున్నమి రాజు
ఎదలో ఎలా వాలాడో
నక్షత్రాలన్నీ ఇలా కలలై వచ్చాయి
చూస్తూనే నిజమై అవి ఎదటే నిలిచాయి
ఆణువణువూ అమృతంలో తడిసింది అద్భుతంగా
వెన్నెల్లో నడిచే మబ్బుల్లాగా
వర్షంలో తడిసే సంద్రంలాగా

ఇట్టే కరుగుతున్నది
మహా ప్రియమైన ఈ క్షణం
వెనకకు తిరగనన్నది
ఎలా కాలాన్ని ఆపడం
మదిలా మంటే ఈడు
తీయని శృతిగా మారి
ఎటో పోతుంటే
కావాలంటే చూడు నీ ఆనందం
మనతో తను వస్తుంటే
ఈ హాయి అంతా
మహా భద్రంగా దాచి
పాపాయి చేసి నా ప్రాణాలే పోసి
నూరేళ్ళ కానుకల్లే నీ చేతికియ్యలేనా

ఆకాశం అంతఃపురమైంది
నా కోసం అందిన వరమైంది
రావమ్మా మహరాణి ఏలమ్మ కాలాన్ని
అంది ఈ లోకమే అంతా సౌందర్యమే
ఆకాశం అంతఃపురమైంది
నా కోసం అందిన వరమైంది



Credits
Lyrics powered by www.musixmatch.com

Link