Manasainadedo (From "Sammohanam")

మనసైనదేదో వరించిందిలా
తలపే తరంగమై తరిమిందిలా
వలపో, పిలుపో, మురుపో ఏమో
అంతా వింతే, అందేదెంతో

తనివార నాలో వెలుగాయె
చిరుయెండ చాటు వానాయె
లోనజడి పిలిచేనా
పూలనది పలికేనా
పైనా లోనా వేడుకలే
అందేదెంతో దేనికదే
పైనా లోనా వేడుకలే
అందేదెంతో దేనికదే

అరుదైన రాగ రవమే వెంటాడెనా
మరుమల్లె తావి వరమై జంటాయెనా
చిగురంత చాలులే, సరేనా

జగమంత నేనై జయించేనులే
వలపే వసంతమై విరిసిందిలే
కలలూ చెలిమీ కలిసే వేళ
నాలో నువ్వే, నీలో నేనే

అరుదైన రాగ రవమే వెంటాడెనా
మరుమల్లె తావి వరమై జంటాయెనా
చిగురంత చాలులే, సరేనా



Credits
Writer(s): Vivek Sagar, Indraganti Srikantha Sarma
Lyrics powered by www.musixmatch.com

Link