Gudilo Badilo Madilo - From "D.J."

అస్మైక యోగ తస్మైక భోగ రస్మైక రాగ హిందోళం
అంగాంగ తేజ శృంగార భావ సుకుమార సుందరం
ఆచంద్ర తార సంధ్యా సమీర నీహార హార భూపాలం
ఆనంద తీర బృందా విహార మందార సాగరం

మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపే శశివదనా
గదిలో మదిలో ఎదలో సొదలో నీవె కదా గజగమనా

మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపే శశివదనా
గదిలో మదిలో ఎదలో సొదలో నీవె కదా గజగమనా

ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం
ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం
అగ్రహారాల తమలపాకల్లె తాకుతోంది తమకం

మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపే శశివదనా
గదిలో మదిలో ఎదలో సొదలో నీవె కదా గజగమనా

అస్మైక యోగ తస్మైక భోగ రస్మైక రాగ హిందోళం
అంగాంగ తేజ శృంగార భావ సుకుమార సుందరం
ఆచంద్ర తార సంధ్యా సమీర నీహార హార భూపాలం
ఆనంద తీర బృందా విహార మందార సాగరం

ధీం తక ధీం తకిట ధీం ధీం ధీం ధీం
ధీం తక ధీం తకిట తకిట తికిట తోంకిట తరకిట-తకదిమి

నవ లలన నీ వలన కలిగె ఎంతొ వింత చలి నాలోన
మిసమిసల నిశిలోన కసిముద్దులిచ్చుకోనా
ప్రియ జగణ శుభ లగణ తల్లకిందులౌతు తొలిజగడాన
ఎడతెగని ముడిపడని రసకౌగిలింతలోన
కనులనే వేయి కలలుగా చేసి కలిసిపోదాము కలకాలం
వానలా వచ్చి వరదలా మారె వలపు నీలిమేఘం

మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపే శశివదనా
గదిలో మదిలో ఎదలో సొదలో నీవె కదా గజగమనా

ప్రియ రమణ శత మదన కన్నె కాలు జారి ఇక నీతోన
ఇరు ఎదల సరిగమన సిగ పూల నలిగిపోనా
హిమలయన సుమశయన చిన్నవేలు పట్టి శుభతరుణాన
మనసతునా దొరికితినా పరదాలు తొలగనీనా
పడకగది నుంచి విడుదలే లేని విడిది వేచింది మనకోసం
వయసు తొక్కిళ్ళ పడుచు ఎక్కిళ్ళు తెచ్చె మాఘమాసం

మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపే శశివదనా
గదిలో మదిలో ఎదలో సొదలో నీవె కదా గజగమనా

అస్మైక యోగ తస్మైక భోగ రస్మైక రాగ హిందోళం
అంగాంగ తేజ శృంగార భావ సుకుమార సుందరం
ఆచంద్ర తార సంధ్యా సమీర నీహార హార భూపాలం
ఆనంద తీర బృందా విహార మందార సాగరం



Credits
Writer(s): Devi Sri Prasad, Sahithi Cherukupally
Lyrics powered by www.musixmatch.com

Link