Kammani - From "Guna"

రాయి
ఏం రాయాలి?
Letter
ఎవరికి?
నీకు
నాకా?
నాకు రాయడం రాదు
ఈ మధ్యనే సంతకం పెట్టడం నేర్చుకున్నా
నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
నాకు చదివి వినిపించి
తర్వాత నువ్ చదువుకో
I like it
ఊ చెప్పు

నా ప్రియ
ప్రేమతో
నీకు నీకు
నే రాసే
నేను ఊ
రాసే ఉత్తరం
ఉత్తరం letter ఛ లేఖ ఊ కాదు
ఉత్తరమే అని రాయి
చదువు

కమ్మని ఈ ప్రేమ లేఖనే
రాసింది హృదయమే
పాటలా మార్చి రాశావా?
అప్పుడు నేను కూడా మారుస్తా
మొదట నా ప్రియ అన్నాను కదా
అక్కడ ప్రియతమా అని మార్చుకో
ప్రియతమా నీ ఇంట్లో క్షేమమా?
నేను ఇక్కడ క్షేమం
ప్రియతమా నీవచట కుశలమా?
నేనిచట కుశలమే
ఆహా ఓహో
నిన్నూహించుకుంటే కవిత మనసులో
వరదలా పొంగుతుంది
కాని అదంతా రాయాలని కూర్చుంటే
అక్షరాలే మాటలే
ఊహలన్ని పాటలే కనుల తోటలో
అదే
తొలి కలల కవితలే మాట మాటలో
అదే, ఆహా
బ్రహ్మాండం కవిత కవిత పాడు

కమ్మనీ నీ ప్రేమలేఖనే రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా?
నేనిచట కుశలమే
ఊహలన్నీ పాటలే కనుల తోటలో
తొలి కలల కవితలే మాట మాటలో
ఓహో కమ్మని ఈ ప్రేమలేఖనే
రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా?
నేనిచట కుశలమే

నాకు తగిలిన గాయం
అదే చల్లగా మానిపోతుంది
అదేమిటో నాకు తెలీదు
ఏం మాయో తెలీదు
నాకేమి కాదసలు
ఇది కూడా రాసుకో
అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ
అలాంటివి వేసుకోవాలి
ఇదిగో చూడు
నాకు ఏ గాయం అయినప్పటికీ
ఒళ్లు తట్టుకుంటుంది
నీ ఒళ్లు తట్టుకుంటుందా?
తట్టుకోదు మా దేవి దేవి ఉమా దేవి
అది కూడా రాయాలా?
అహ హ అది ప్రేమ
నా ప్రేమ ఎలా చెప్పాలో
తెలీక ఇదవుతుంటే ఎడుపొస్తోంది
కాని నేనేడ్చి నా శోకం
నిన్ను కూడా బాధ పెడుతుందనుకున్నపుడు
వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది
మనుషులు అర్థం చేసుకునేందుకు
ఇది మామూలు ప్రేమ కాదు
ప్రేమ కాదు, ప్రేమ కాదు, ప్రేమ కాదు
ప్రేమ కాదు, ప్రేమ కాదు
అగ్ని లాగ స్వచ్ఛమయినది
స్వచ్ఛమయినది, స్వచ్ఛమయినది
స్వచ్ఛమయినది, స్వచ్ఛమయినది, స్వచ్ఛమయినది
గుండెల్లో గాయమేమో చల్లంగ మానిపోయే
మాయ చేసే ఆ మాయే ప్రేమాయే

ఎంత గాయమైన గాని నా మేనికేమి గాదు
పువ్వు సోకి నీ సోకు కందేనే
వెలికి రాని వెర్రి ప్రేమ
కన్నీటి ధారలోన కరుగుతున్నది
నాదు శోకమోపలేక
నీ గుండె బాధపడితే తాళనన్నది
మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు
అగ్ని కంటే స్వచ్చమైనది
మమకారమే ఈ లాలి పాటగా
రాసేది హృదయమా
ఉమాదేవిగా శివుని అర్ధ భాగమై
నాలోన నిలువుమా
శుభలాలి లాలి జో లాలి లాలి జో
ఉమాదేవి లాలి జో లాలి లాలి జో

మమకారమే ఈ లాలి పాటగా
రాసేది హృదయమా
నా హృదయమా



Credits
Writer(s): Vennelakanti, Ilayaraja
Lyrics powered by www.musixmatch.com

Link