Siva Siva Ananelaraa

శివ శివ అననేలరా.
శివ శివ అననేలరా
కౌగిలిలో కైలాస మందగా.
కౌగిలిలో నే కైలాస మీయగా
శివ శివ అననేలరా

కొందరికేమో జన్మకో శివరాత్రి
ఈ సుందరికి ప్రతిరాత్రి నవరాత్రి
కొందరికేమో జన్మకో శివరాత్రి
ఈ సుందరికి ప్రతిరాత్రి నవరాత్రి

భక్తులకు బ్రతుకు గడుపగా. గడుపగా. ముక్తి
మనబోటి రక్తులకు. సనిద నిదప గా మా పా
మనబోటి రక్తులకు. సగమా గమద మనిద మదప
మనబోటి రక్తులకు... ఘడియ ఘడియకు. ముక్తీ
శివ . . శివ

శివ శివ అననేలరా
కౌగిలిలో కైలాస మందగా
కౌగిలిలో నేకైలాస మీయగా
శివ శివ అననేలరా ... రా. రా

టక్కరి మరుని ఉక్కడగించెను
నాటి ముక్కంటి చూపు
కాలిన మదనుని మేలుకొలిపెను
నేటి నీ కొంటె చూపు

సగము మేనిలో మగువను నిలిపిన
సగము మేనిలో మగువను నిలిపిన
చంద్రధరుడు ఆ హరుడు
తనువు తనువె ఈ తరణి కొసంగిన
రసిక వరుడు. ఈ హరుడు. శివ. శివ

శివ శివ అననేలరా
కౌగిలిలో కైలాస మందగా
కౌగిలిలో నేకైలాస మీయగా.
శివ. శివ. శివ శివ అననేలరా. రా. రా. రా



Credits
Writer(s): Sathyam, Veturi Sundara Ramamurthy, Adi Narayana Rao
Lyrics powered by www.musixmatch.com

Link