Ninnukori - From "Gharshana-Old"

నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసే నీ నయనం నయనం
ఉరికిన వాగల్లే
తొలకరి కవితల్లే
తలపులు కదిలేనే
చెలి మది విరిసేనే
రవికుల రఘురామ
అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసే నీ నయనం నయనం

ఉడికించే చిలకమ్మా నిన్నూరించే
ఒలికించే అందాలే ఆలాపించే
ముత్యాలా బంధాలే నీకందించే
అచ్చట్లూ ముచ్చట్లూ తానాశించే
మోజుల్లోన చిన్నది నీవే తాను అన్నది
కలలే విందు చేసెనే
నీతో పొందు కోరెనే
ఉండాలనీ నీ తోడు చేరిందిలే ఈ నాడు సరసకు
నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసే నీ నయనం నయనం
ఉరికిన వాగల్లే
తొలకరి కవితల్లే
తలపులు కదిలేనే
చెలిమది విరిసేనే
రవికుల రఘురామ
అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసే నీ నయనం నయనం

ఈ వీణా మీటేది నీవేనంటా
నా తలపు, నా వలపు నీదేనంటా
పరువాలా పరదాలు తీసేపూట
కలవాలి కరగాలి నీలోనంట
పలికించాలి స్వాగతం
పండించాలి జీవితం
నీకూ నాకు ఈ క్షణం
కానీ రాగ సంగమం
నీ జ్ఞాపకం నాలోన సాగేనులే ఈ వేళకు సరసకు
నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసే నీ నయనం నయనం
ఉరికిన వాగల్లే
తొలకరి కవితల్లే
తలపులు కదిలేనే
చెలి మది విరిసేనే
రవికుల రఘురామ
అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసే నీ నయనం నయనం



Credits
Writer(s): Ilayaraja, Rajaram Shinde Rajashree
Lyrics powered by www.musixmatch.com

Link