Ee Mounam

ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుక
ఈ మౌనం ఈ బిడియం ఇదేలే ఇదేలే మగువ కానుక
ఈ మౌనం

ఇన్నినాళ్ళ మన వలపులు వికసించుట ఇందుకా
ఇన్నినాళ్ళ మన వలపులు వికసించుట ఇందుకా
మమతలన్ని తమకు తామె
మమతలన్ని తమకు తామె అల్లుకొనెడి మాలిక ఆ ఆ
ఆహ
ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుక
ఈ మౌనం

మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక
అహ ఓహొ
ఆ అహ
మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక
కనులు కలిసి అనువదించు ప్రణయ భావగీతిక ఆ ఆ ఆ
ఈ మౌనం ఈ బిడియం ఇదేలే ఇదేలే మగువ కానుక
ఈ మౌనం

ఏకాంతము దొరికినంత ఎడమోమా నీవేడుక
ఏకాంతము దొరికినంత ఎడమోమా నీవేడుక
ఎంత ఎంత ఎడమైతే
ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక ఆ ఆ

ఈ మౌనం
ఓహో
ఈ బిడియం
ఊహు
ఇదేనా ఇదేనా చెలియ కానుక
ఈ మౌనం
ఓహో
ఈ బిడియం
ఊహు
ఇదేలే ఇదేలే మగువ కానుక



Credits
Writer(s): Arudra, S Rajeswara Rao
Lyrics powered by www.musixmatch.com

Link