Oo Choope (From "Utthara")

ఓ చూపే చుక్కల ముగ్గులా
రూపం గోపెమ్మలా
నీ నడకే చినుకు సడిలా
చిరునవ్వే హరివిల్లులా
ముచ్చట్లే చెప్తుంటే
మహరాణల్లే ఉంటావే
నువు గుమ్మంలో కూర్చుంటే చాలు అనిపిస్తుందే
కన్నుల్లో లోకాన్ని నువు దాచావో ఏమోలే
స్వప్నాలన్నీ నీలో చుసానే
నీ వలన గుండె చాటున
ఉన్నట్టుండి వింత భావన
నీ ప్రేమలో మునిగే పోయానా
ఉన్నపాటు ఊహాలోకాన

అందాల దేవత భూలోక వాసిగా
మారి ముందుంటే చూస్తున్నా
ఇన్నాళ్ళ నా కల ఇవ్వాళే నీవుగా
నా ముందే నిలిచేనా
ఆ హంపి చిత్రంలా
మా బాపు బొమ్మలా
గుండెల్లో గీసానే నిన్నే
నీ కొంటె చూపులే
ఆ కొండ మల్లెలై
నా కంటి చుట్టూ పూసెనా

సన్నజాజిలా సందె పొద్దులా

ఉంటావే కొంటె కోకిలా

గొబ్బెమ్మలా గుడిలో దేవిలా

నిన్ను చూస్తే నిదరే రాదెలా

అద్దంలో మనసే
చూపింది నిన్నేనా
నేడీ దూరాన్నే పొమ్మన్నా
రోజులా నీవున్నా
మాయేదో మంత్రంలా
మార్చింది నన్నే నీలా
ఏ వేళలోనైనా నీ ధ్యాసలో ఉన్నా
నా దారి మార్చింది ప్రేమే
వేకువ రాత్రైనా వేరేగా మారనీ
నీ ఊహల్లోనే ఉంటున్నా
హాయిలోన ఉండిపోతున్నా
గాలిలో తేలిపోతున్నా
నీ ప్రేమనే నా సొంతం అంటున్నా
జంటగానే నీతో వస్తున్నా



Credits
Writer(s): Suresh Bobbili
Lyrics powered by www.musixmatch.com

Link