Bhagawadh Geetha
మొదటి భాగము
001 పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేనస్వయం వ్యాసేన గ్రథితాం
పురాణమునినా మధ్యే మహాభారతం అద్వ్యైతమృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం
అంబ! త్వామనుసందధామి భగవద్గీతే భవ ద్వేషిణీం
భగవద్గీతే భవ ద్వేషిణీం
భగవద్గీత
మహాభారతము యొక్క సమగ్ర సారాంశము.
భక్తుడైన అర్జునునకు ఒనర్చిన ఉపదేశమే గీతా సారాంశము.
భారత యుద్ధము జరుగరాదని సర్వ విధముల భగవానుడు ప్రయత్నించెను.
కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయెను.
అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథియై నిలిచెను.
యుద్ధ రంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను.
అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను,గురువులను,మేనమామలను, సోదరులను, మనుమలను, మితృలను చూచి, హృదయము ద్రవించి,
002: న కాఙ్క్షే విజయఁ కృష్ణ న చ రాజ్యఁ సుఖాని చ
కిఁ నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా
కిం భోగైర్జీవితేన వా
స్వజనమును చంపుటకు ఇష్టపడక "నాకు విజయమూ వలదు,రాజ్య సుఖమూ వలదు" అని ధనుర్బాణములను క్రిందవైచె. దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ:
003 అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాఁశ్చ
భాషసే గతాసూనగతాసూఁశ్చ నానుశోచంతి పణ్డితాః
నానుశోచంతి పణ్డితాః
దుఃఖింప తగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము.
ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని,
నిత్యములూ, శాశ్వతములూ అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు.
004 దేహినోస్మిన్యథా దేహే కౌమారఁ యౌవనఁ జరా
తథా దేహాంతరప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి
జీవునకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము యెట్లో,
మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహము నొందరు.
005 వాసాఁసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి
తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సఁయాతి నవాని దేహీ
మనుష్యుడు, ఎట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించునో,
అట్లే, ఆత్మ - జీర్ణమైన శరీరమును వదలి క్రొత్త శరీరమును ధరించుచున్నది.
006 నైనఁ చ్హిందంతి శస్త్రాణి నైనఁ దహతి పావకః
న చైనఁ క్లేదయంత్యాపో న శోషయతి మారుతః
న శోషయతి మారుతః
ఆత్మ నాశనములేనిది. ఆత్మను శస్త్రములు చేదింపజాలవు, అగ్ని దహింప జాలదు.
నీరు తడుపజాలదు. వాయువు ఆర్పివేయనూ సమర్థము కాదు. ఆత్మ నాశనములేనిది.
007 జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువఁ జన్మ మృతస్య
చ తస్మాదపరిహార్యేర్థే న త్వఁ శోచితుమర్హసి
న త్వఁ శోచితుమర్హసి
పుట్టిన వానికి మరణము తప్పదు.
మరణించిన వానికి జన్మము తప్పదు.
అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు .
008 హతో వా ప్రాప్స్యసి స్వర్గఁ జిత్వా వా భోక్ష్యసే మహీం
తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః
యుద్ధాయ కృతనిశ్చయః
యుద్ధమున మరణించినచో వీర స్వర్గమును పొందెదవు
జయించినచో రాజ్యమును భోగింతువు
కావున అర్జునా యుద్ధమును చేయ కృతనిశ్చ్యుడవై లెమ్ము
009 కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూర
మాతే సఙ్గోస్త్వకర్మణి
కర్మలను ఆచరించుటయందే నీకు అధికారము కలదు కాని
వాని ఫలితము పైన లేదు
నీవు కర్మ ఫలమునకు కారణము కారాదు అట్లని కర్మలను చేయుట మానరాదు
010 దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే
దుఃఖములు కలిగినపుడు దిగులు చెందని వాడును
సుఖములు కలిగినపుడు స్పృహ కోల్పోని వాడును రాగమూ
భయమూ క్రోధమూ పోయినవాడును స్థిత ప్రజ్ఞుడని చెప్పబడును
011 ధ్యాయతో విషయాంపుఁసః సఙ్గస్తేషూపజాయతే సఙ్గాత్సఁజాయతే కామః
కామాత్క్రోధోభిజాయతే
క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్స్మృతివిభ్రమః
స్మృతిభ్రఁశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి
బుద్ధినాశాత్ప్రణశ్యతి
విషయ వాంచలను గూర్చి సదా మననము చేయువానికి, వానియందనురాగ మధికమై,
అది కామముగా మారి, చివరకు క్రోధమగును. క్రోధము వలన అవివేకము కలుగును.
దీనివలన జ్ఞాపకశక్తి నశించి,
దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును.
012 ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య
విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మనిర్వాణమృచ్చ్హతి
ఆత్మజ్ఞాన పూర్వక కర్మానుష్ఠానము,
బ్రహ్మ ప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమున
బడక సుఖైక స్వరూపమైన ఆత్మ ప్రాప్తిని చెందగలడు.
013 లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా
మయానఘ జ్ఞానయోగేన సాఙ్ఖ్యానాఁ కర్మయోగేన యోగినాం
అర్జునా! ఈ లోకములో ఆత్మానాత్మ వివేకముగల సన్యాసులకు జ్ఞానయోగము చేతను
చిత్తశుద్ధిగల యోగీశ్వరులకు కర్మయోగము చేతను ముక్తి కలుగు చున్నదని
సృష్టి ఆదియందు నాచే చెప్పబడియున్నది.
014 అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః
అన్నమువలన జంతుజాలము పుట్టును
వర్షము వలన అన్నము సమకూడును
యజ్ఞము వలన వర్షము కలుగును ఆ యజ్ఞము కర్మ వలననే సంభవము
015 ఏవం ప్రవర్తితఁ చక్రం నానువర్తయతీహ యః
అఘాయురింద్రియారామో మోఘం పార్థ స జీవతి
పార్థా! నాచే నడుపబడు ఈ లోకము అను చక్రమునుబట్టి
ఎవడు అనుసరింపడో వాడు ఇంద్రియలోలుడై పాప జీవనుడగుచున్నాడు
అట్టివాడు వ్యర్థుడు
జ్ఞాని కానివాడు సదా కర్మల నాచరించుచునే యుండవలెను
016 యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే
లోకస్తదనువర్తతే
ఉత్తములు అయినవారు దేని నాచరింతురో,
దానినే ఇతరులును ఆచరింతురు.
ఉత్తములు దేనిని ప్రమాణముగా అంగీకరింతురో, లోకమంతయూ దానినే అనుసరింతును.
017 మయి సర్వాణి కర్మాణి సఁన్యస్యాధ్యాత్మచేతసా
నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః
అర్జునా! నీవొనర్చు సమస్త కర్మలనూ నాయందు సమర్పించి,
జ్ఞానముచే నిష్కాముడవై,
అహంకారము లేనివాడవై, సంతాపమును వదలి యుద్ధమును చేయుము.
018 శ్రేయాన్స్వధర్మో విగుణః
పరధర్మాత్స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనఁ శ్రేయః పరధర్మో భయావహః
చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మముకన్న, గుణము లేనిదైననూ స్వధర్మమే మేలు.
అట్టి ధర్మాచరణమున మరణము సంభవించిననూ మేలే.
పరధర్మము భయంకరమైనది. ఆచరణకు అనుచితమైనది.
019 ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ
యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతం
పొగచేత అగ్ని, మురికిచేత అద్దము,
మావిచేత శిశువు యెట్లు కప్పబడునో,
అట్లే కామముచేత జ్ఞానము కప్పబడియున్నది.
020 యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం
సృజామ్యహం
పరిత్రాణాయ సాధూనాఁ వినాశాయ చ
దుష్కృతాం ధర్మసఁస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే
ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్ధి నొందునో,
ఆయా సమయములయందు శిష్టరక్షణ, దుష్టశిక్షణ,
ధర్మ సం రక్షణముల కొఱకు ప్రతి యుగమున అవతారమును దాల్చుచున్నాను.
021 వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః
బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః
అనురాగమూ, భయమూ, క్రోధమూ వదిలి నాయందు మనస్సు లగ్నము చేసి
ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగముచేత
పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి.
022 యే యథా మాం ప్రపద్యంతే తాఁస్తథైవ భజామ్యహం
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః
ఎవరెవరు యేయే విధముగా నన్ను తెలియగోరుచున్నారో,
వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను.
కాని, ఏ ఒక్కనియందును అనురాగము కాని, ద్వేషము కాని లేదు.
023 యస్య సర్వే సమారంభాః కామసఙ్కల్పవర్జితాః
జ్ఞానాగ్నిదగ్ధకర్మాణఁ తమాహుః పణ్డితం బుధాః
ఎవరి కర్మాచరణములు కామ సంకల్పములు కావో,
ఎవని కర్మలు జ్ఞానమను నిప్పుచే కాల్పబడినవో,
అట్టివానిని పండితుడని విధ్వాంసులు పల్కుదురు.
024 బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా
హుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా
యజ్ఞపాత్రము బ్రహ్మము. హోమద్రవ్యము బ్రహ్మము. అగ్ని బ్రహ్మము.
హోమము చేయువాడు బ్రహ్మము.
బ్రహ్మ కర్మ సమాధిచేత పొందనగు ఫలము కూడా బ్రహ్మమనియే తలంచవలయును.
025 శ్రద్ధావా్ల్లభతే జ్ఞానం తత్పరః సఁయతేంద్రియః
జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేణాధిగచ్చ్హతి
శ్రద్ధ, ఇంద్రియనిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్థుడగును.
అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును.
ఇది భగవద్గీత యందు బ్రహ్మవిద్యయను యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు
అర్జునునకుప దేశించిన విషాద, సాంఖ్య, కర్మ, జ్ఞాన యోగములు సమాప్తము.
రెండవ భాగము
026 సఁన్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ
తయోస్తు కర్మసఁన్యాసాత్కర్మయోగో విశిష్యతే
కర్మ సన్యాసములు రెండునూ మోక్షసోపానములు.
అందు కర్మ పరిత్యాగము కన్న కర్మానుష్ఠానమే శ్రేష్టమైనది.
027 బ్రహ్మణ్యాధాయ కర్మాణి సఙ్గఁ త్యక్త్వా
కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా
ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక, బ్రహ్మార్పణముగా కర్మలనాచరించునో,
అతడు తామరాకున నీటిబిందువులు అంటని రీతిగా పాపమున చిక్కుబడడు.
028 జ్ఞానేన తు తదజ్ఞానం యేషాఁ నాశితమాత్మనః
తేషామాదిత్యవజ్జ్ఞానం ప్రకాశయతి తత్పరం
ఎవని అజ్ఞానము జ్ఞానముచేత నశింపబడునో,
అతనికి జ్ఞానము సూర్యుని వలె ప్రకాశించి, పరమార్థ తత్వమును చూపును.
029 విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శుని చైవ శ్వపాకే చ
పణ్డితాః సమదర్శినః
విద్యా వినయ సంపన్నుడగు బ్రాహ్మణునియందునూ,
శునకమూ, శునకమాంసము వండుకొని
తినువానియందునూ పండితులు సమదృష్టి కలిగియుందురు.
030 శక్నోతీహైవ యః సోఢుం ప్రాక్శరీరవిమోక్షణాత్
కామక్రోధోద్భవం వేగం స యుక్తః స సుఖీ నరః
దేహత్యాగమునకు ముందు ఎవడు కామక్రోధాది
అరిష్డ్వర్గముల జయించునో, అట్టివాడు యోగి అనబడును.
031యతేంద్రియమనోబుద్ధిర్మునిర్మోక్షపరాయణః
విగతేచ్చ్హాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః
ఎవడు ఇంద్రియములను జయించి, దృష్టిని భ్రూమధ్యమున నిలిపి,
ప్రాణాపాన వాయువులను స్తంభింపజేసి, మనస్సునూ,
బుద్ధినీ స్వాధీనమొనర్చుకొని
మోక్షాసక్తుడై ఉండునో, అట్టివాడే ముక్తుడనబడును.
032 భోక్తారం యజ్ఞతపసాఁ సర్వలోకమహేశ్వరం సుహృదం
సర్వభూతానాఁ జ్ఞాత్వా మాఁ శాంతిమృచ్చ్హతి
సకల యజ్ఞ తపః ఫలములను పొందువానిగనూ,
సకల ప్రపంచ నియామకునిగనూ నన్ను
గ్రహించిన మహనీయుడు మోక్షమును పొందుచున్నాడు.
033 యం సఁన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి
పాణ్డవ న హ్యసఁన్యస్తసఙ్కల్పో యోగీ భవతి కశ్చన
అర్జునా! సన్యాసమని దేనినందురో,
దానినే కర్మయోగమనియూ అందురు.
అట్టి యెడ సంకల్పత్యాగ మొనర్పనివాడు యోగి కాజాలడు.
034 యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు
యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా
యుక్తాహార విహారాదులు, కర్మాచరణము గలవానికి ఆత్మ సం యమ యోగము లభ్యము.
035 యథా దీపో నివాతస్థో నేఙ్గతే సోపమా స్మృతా
యోగినో యతచిత్తస్య యుఞ్జతో యోగమాత్మనః
గాలిలేనిచోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగుననే,
మనో నిగ్రహముకలిగి, ఆత్మయోగ మభ్యసించినవాని చిత్తము నిశ్చలముగా నుండును.
036 సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః
సకల భూతములయందూ సమదృష్టి కలిగినవాడు,
అన్ని భూతములు తన యందునూ, తనను అన్ని భూతములయందునూ చూచుచుండును.
037 అసఁశయం మహాబాహో మనో దుర్నిగ్రహఁ చలం
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే
అర్జునా! ఎట్టివానికైననూ మనస్సును నిశ్చలముగా నిల్పుట
దుస్సాధ్యమే. అయిననూ, దానిని అభ్యాస, వైరాగ్యములచేత నిరోధింపవచ్చును.
038 యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా
శ్రద్ధావాంభజతే యో మాఁ స మే యుక్తతమో మతః
అర్జునా! పరిపూర్ణ విశ్వాసముతో నన్నాశ్రయించి,
వినయముతో ఎవరు సేవించి భజింతురో వారు సమస్త యోగులలో ఉత్తములు.
039 మనుష్యాణాఁ సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే
యతతామపి సిద్ధానాఁ కశ్చిన్మాఁ వేత్తి తత్త్వతః
వేలకొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొఋఅకు ప్రయత్నించును.
అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు
మాత్రమే నన్ను యదార్థముగా తెలుసు కొనగలుగుచున్నాడు.
040 భూమిరాపోనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ
అహఁకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా
భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి,
అహంకారము అని నా మాయాశక్తి ఎనిమిది
విధములైన బేధములతో ఒప్పి యున్నదని గ్రహింపుము.
041 మత్తః పరతరం నాన్యత్కిఁచిదస్తి ధనఁజయ
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ
అర్జునా! నా కన్న గొప్పవాడుగాని,
గొప్పవస్తువుగాని మరేదియూ ప్రపంచమున లేదు.
సూత్రమున మణులు గ్రుచ్చబడినట్లు యీ జగమంతయూ నాయందు నిక్షిప్తమై ఉన్నది.
042 పుణ్యో గంధః పృథివ్యాఁ చ తేజశ్చాస్మి
విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు
భూమియందు సుగంధము, అగ్నియందు తేజము,
యెల్ల భూతములయందు ఆయువు, తపస్వులయందు తపస్సు నేనుగా నెరుగుము.
043 దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా
మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే
పార్థా! త్రిగుణాత్మకము,
దైవ సంబంధము అగు నా మాయ అతిక్రమింప రానిది.
కాని, నన్ను శరణుజొచ్చిన వారికి ఈ మాయ సులభసాధ్యము.
044 చతుర్విధా భజంతే మాఁ జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ
జ్ఞానీ చ భరతర్షభ
ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్థకాములు,
జ్ఞానులు అను నాలుగు విధములైన పుణ్యాత్ములు నన్నాశ్రయించుచున్నారు.
045 బహూనాఁ జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే
వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః
జ్ఞాన సంపన్నుడైన మానవుడు అనేక జన్మములెత్తిన
పిమ్మట, విజ్ఞానియై నన్ను శరణము నొందుచున్నాడు.
046 అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యః
ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సఁశయః
ఎవడు అంత్యకాలమున నన్ను స్మరించుచూ
శరీరమును వదలుచున్నాడో, వాడు నన్నే చెందుచున్నాడు.
047 అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా
పరమం పురుషం దివ్యఁ యాతి పార్థానుచింతయన్
కవిం పురాణమనుశాసితారం అణోరణీయఁసమనుస్మరేద్యః
సర్వస్య ధాతారమచింత్యరూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్
అర్జునా! ఎవడు అభ్యాసయోగముతో,
ఏకాగ్ర చిత్తమున దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించునో,
అట్టివాడు ఆ పరమపురుషునే చెందుచున్నాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు;
పురాణ పురుషుడు; ప్రపంచమునకు శిక్షకుడు; అణువు కన్నా అణువు;
అనూహ్యమైన రూపము కలవాడు;
సూర్య కాంతి తేజోమయుడు; అజ్ఞానాంధకారమునకన్న ఇతరుడు.
048 అవ్యక్తోక్షర ఇత్యుక్తస్తమాహుః పరమాఁ గతిం
యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ
ఇంద్రియ గోచరము కాని పరబ్రహ్మపదము
శాశ్వతమైనది. పునర్జన్మ రహితమైన ఆ ఉత్తమపదమే పరమపదము.
049 శుక్లకృష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే
ఏకయా యాత్యనావృత్తిమన్యయావర్తతే పునః
జగత్తునందు శుక్ల కృష్ణము లనెడి రెండు మార్గములు నిత్యములుగా ఉన్నవి.
అందు మొదటి మార్గము వలన జన్మరాహిత్యము,
రెండవ దానివలన పునర్జన్మము కలుగు చున్నవి.
050 వేదేషు యజ్ఞేషు తపఃసు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి
తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం
యోగియైనవాడు వేదాధ్యయనము వలన,
యజ్ఞతపోదానాదుల వలన కలుగు పుణ్యఫలమును
ఆశింపక, ఉత్తమ పదమైన బ్రహ్మపదమును పొందగలడు.
051 సర్వభూతాని కౌంతేయ ప్రకృతిఁ యాంతి మామికాం
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం
పార్థా! ప్రళయకాలమున సకల ప్రాణులును నా యందు లీనమగుచున్నవి.
మరల కల్పాది యందు సకల ప్రాణులనూ నేనే సృష్టించు చున్నాను.
052 అనన్యాశ్చింతయంతో మాఁ యే జనాః పర్యుపాసతే
తేషాఁ నిత్యాభియుక్తానాఁ యోగక్షేమం వహామ్యహం
ఏ మానవుడు సర్వకాల సర్వావస్థలయందు నన్నే ధ్యానించు
చుండునో అట్టివాని యోగక్షేమములు నేనే వహించు చున్నాను.
053 పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా
ప్రయచ్చ్హతి తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః
ఎవడు భక్తితో నాకు పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను,
ఉదక మైనను ఫలాపేక్ష రహితముగా సమర్పించుచున్నాడో,
అట్టివానిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను.
054 మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాఁ నమస్కురు
మామేవైష్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణః
పార్థా! నా యందు మనస్సు లగ్నము చేసి యెల్ల కాలములయందు
భక్తి శ్రద్ధలతో స్థిరచిత్తుడవై పూజించితివేని నన్నే పొందగలవు.
ఇది ఉపనిషత్తుల సారాన్శమైన యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునునకుప
దేశించిన కర్మసన్యాస, ఆత్మసంయమ, విజ్ఞాన,
అక్షర పరబ్రహ్మ, రాజ విద్యా రాజగుహ్య యోగములు సమాప్తము.
మూడవ భాగము
055 మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా
మద్భావా మానసా జాతా యేషాఁ లోక ఇమాః ప్రజాః
కశ్యపాది మహర్షి సప్తకము, సనక సనందనాదులు,
స్వయంభూవాది మనువులు నా వలననే జన్మించిరి.
పిమ్మట వారి వలన ఎల్ల లోకములందలి సమస్త భూతములును జన్మించెను.
056 మచ్చిత్తా మద్గతప్రాణా బోధయంతః పరస్పరం
కథయంతశ్చ మాఁ నిత్యఁ తుష్యంతి చ రమంతి చ
పండితులు నాయందు చిత్తముగలవారై నా యందే తమ ప్రాణములుంచి నా మహిమానుభావ
మెరింగి ఒకరికొకరు ఉపదేశములు
గావించుకొంచు బ్రహ్మా నందమును అనుభవించుచున్నారు.
057 అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః
అహమాదిశ్చ మధ్యఁ చ భూతానామంత ఏవ చ
సమస్త భూతముల మనస్సులందున్న పరమాత్మ స్వరూపుడను
నేనే. వాని ఉత్పత్తి, పెంపు, నాశములకు నేనే కారకుడను.
058 వేదానాఁ సామవేదోస్మి దేవానామస్మి వాసవః
ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా
వేదములలో సామవేదము, దేవతలలో దేవేంద్రుడు,
ఇంద్రియములలో మనస్సు, ప్రాణులందరి బుద్ధి నేనే.
059 ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాఁ కాలః కలయతామహం
మృగాణాఁ చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం
రాక్షసులలో ప్రహ్లాదుడు, గణికులలో కాలము,
మృగములలో సింహము, పక్షులలో గరుత్మంతుడు నేనే.
060 యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జితమేవ
వా తత్తదేవావగచ్చ్హ త్వం మమ తేజోఁశసంభవం
లోకమునందు ఐశ్వర్య యుక్తమై, పరాక్రమ యుక్తమై,
కాంతి యుక్తమైన సమస్త వస్తువులు నా తేజో భాగము వలననే సంప్రాప్తమగును.
061 పశ్య మే పార్థ రూపాణి శతశోథ సహస్రశః నానావిధాని దివ్యాని
నానావర్ణాకృతీని చ
పార్థా! దివ్యములై, నానా విధములై,
అనేక వర్ణములై అనేక విశేషములగు నా అస్వస్వరూపమును కన్నులారా దర్శింపుము.
062 పశ్యామి దేవాఁస్తవ దేవ దేహే,
సర్వాఁస్తథా భూతవిశేషసఙ్ఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం,
ఋషీఁశ్చ సర్వానురగాఁశ్చ దివ్యాన్
అనేకబాహూదరవక్త్రనేత్రఁ పశ్యామి త్వాఁ సర్వతోనంతరూపం నాంతం న మధ్యం
న పునస్తవాదిఁ పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప
దఁష్ట్రాకరాలాని చ తే ముఖాని దృష్ట్వైవ
కాలానలసన్నిభాని దిశో న జానే న లభే చ
శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస
దేవా! ఎల్ల దేవతలూ, ఎల్ల ప్రాణులూ, బ్రహ్మాదులూ, ఋషీశ్వరులూ,
వాసుకీ మొదలగుగా గల సర్పములూ నీయందు నాకు గోచరమగుచున్నవి. ఈశ్వరా!
నీ విశ్వరూపము అనేక బాహువులతో, ఉదరములతో, ముఖములతో ఒప్పియున్నది.
అట్లైయూ నీ ఆకారమున ఆద్యంత మధ్యములను గుర్తింప జాల కున్నాను.
కోరలచే భయంకరమై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుటవలన నాకు
దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో!
నాయందు దయ యుంచి నాకు ప్రసన్నుడవు
గమ్ము. కృష్ణా! ప్రసన్నుడవు గమ్ము. అర్జునా!
063 కాలోస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో లోకాన్సమాహర్తుమిహ ప్రవృత్తః
ఋతేపి త్వాఁ న భవిష్యంతి సర్వే యేవస్థితాః ప్రత్యనీకేషు యోధాః
అర్జునా! ఈ ప్రపంచమునెల్ల నశింపజేయు బలిష్ఠమైన కాల స్వరూపుడను నేనే.
ఈ యుద్ధమునకు సిద్ధపడిన వారిని నీవు
చంపకున్ననూ - బ్రతుక గలవారిందెవ్వరునూ లేరు.
064 ద్రోణఁ చ భీష్మఁ చ జయద్రథఁ చ కర్ణఁ తథాన్యానపి యోధవీరాన్ మయా
హతాఁస్త్వఁ జహి మావ్యథిష్ఠా యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్
ఇప్పటికే ద్రోణ, భీష్మ,
జయద్రధ కర్ణాధి యోధ వీరులు నాచే
సంహరింపబడిరి. ఇక మిగిలిన శతృ వీరులను నీవు సంహరింపుము.
065 కిరీటినం గదినఁ చక్రహస్తం ఇచ్చ్హామి త్వాఁ ద్రష్టుమహం
తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే
అనేక భుజములుగల నీ విశ్వరూపమును ఉపసంహరించి కిరీటము, గద,
చక్రము ధరించిన నీ సహజ సుందరమైన
స్వరూపమును దర్శింపగోరు చున్నాను కృష్ణా!
066 సుదుర్దర్శమిదం రూపం దృష్ట్వానసి యన్మమ
దేవా అప్యస్య రూపస్య నిత్యఁ దర్శనకాఙ్క్షిణః
అర్జునా! నీవు దర్శించిన ఈ నా స్వరూపమును ఎవ్వరునూ
చూడజాలరు. ఈ విశ్వరూపమును దర్శింప దేవతలందరునూ సదా కోరుచుందురు.
067 మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే
శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః
ఎవరు నాయందే మనస్సు లగ్నము చేసి,
శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానించు చున్నారో,
అట్టివారు అత్యంతమూ నాకు ప్రీతిపాత్రులు. వారే ఉత్తమ పురుషులు.
068 శ్రేయో హి జ్ఞానమభ్యాసాజ్జ్ఞానాద్-ధ్యానం
విశిష్యతే ధ్యానాత్కర్మఫలత్యాగస్త్యాగాచ్చ్హాఁతిరనంతరం
అభ్యాసయోగముకన్న జ్ఞానము, జ్ఞానము కన్న ధ్యానము,
దానికన్న కర్మ ఫలత్యాగమూ శ్రేష్ఠము.
అట్టి త్యాగమువల్ల సంసార బంధనము తొలగి మోక్షప్రాప్తి సంభవించుచున్నది.
069 అనపేక్షః శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః
సర్వారంభపరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః
ఎవడు కోరికలు లేనివాడై, పవిత్రుడై,
పక్షపాత రహితుడై భయమును వీడి కర్మ ఫల త్యాగియై నాకు
భక్తుడగునో అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు.
070 సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణసుఖదుఃఖేషు సమః
సఙ్గవివర్జితః
తుల్యనిందాస్తుతిర్మౌనీ సఁతుష్టో యేన కేనచిత్
అనికేతః స్థిరమతిర్భక్తిమాన్మే ప్రియో నరః
శత్రుమిత్రులయందును, మానావ మానములయందును,
శీతోష్ణ సుఖ దుఃఖాదులయందును సమబుద్ధి కలిగి, సంగరహితుడై,
నిత్య సంతుష్టుడై, చలించని మనస్సు కలవాడై,
నాయందు భక్తి ప్రపత్తులు చూపు మానవుడు నాకు ప్రీతిపాత్రుడు.
071 ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో
వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః
అర్జునా! దేహము క్షేత్రమనియూ,
దేహమునెరిగినవాడు క్షేత్రజ్ఞుడనియూ పెద్దలు చెప్పుదురు.
072 అధ్యాత్మజ్ఞాననిత్యత్వఁ
తత్త్వజ్ఞానార్థదర్శనం ఏతజ్జ్ఞానమితి ప్రోక్తమజ్ఞానం యదతోన్యథా
ఆత్మ జ్ఞానమునందు మనస్సు లగ్నము చేయుట,
మౌక్షప్రాప్తి యందు దృష్టి కలిగియుండుట జ్ఞాన
మార్గములనైయూ, వానికి ఇతరములైనవి అజ్ఞానములనియూ చెప్పబడును.
073 కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే
పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే
ప్రకృతిని "మాయ" యని యందురు.
అది శరీర సుఖదుఃఖాదులను తెలియజేయును.
క్షేత్రజ్ఞుడు ఆ సుఖ దుఃఖములను అనుభవించుచుండును.
074 సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరం
వినశ్యత్స్వవినశ్యంతఁ యః పశ్యతి స పశ్యతి
శరీరము నశించిననూ తాను సశింపక ఎవడు సమస్త
భూతములందున్న పరమేశ్వరుని చూచునో వాడే యెరిగినవాడు.
075అనాదిత్వాన్నిర్గుణత్వాత్పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి
న లిప్యతే
అర్జునా! గుణ నాశన రహితుడైనవాడు పరమాత్మ.
అట్టి పరమాత్మ దేహాంత ర్గతుడయ్యునూ కర్మల నాచరించువాడు కాడు.
076 యథా ప్రకాశయత్యేకః కృత్స్నఁ లోకమిమం రవిః
క్షేత్రఁ క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత
పార్థా! సూర్యుడొక్కడే యెల్ల జగత్తులనూ ఏ విధముగా
ప్రకాశింపజేయుచున్నాడో ఆ విధముగనే
క్షేత్రజ్ఞుడు యెల్ల దేహములనూ ప్రకాశింపజేయుచున్నాడు.
ఇది ఉపనిషత్తుల సారాన్శమైన గీతాశాస్త్రమందు శ్రీకృష్ణుడు అర్జునునకుప
దేశించిన విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము,
భక్తి యోగము, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగములు సమాప్తము.
నాల్గవ భాగము
077 పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాఁ జ్ఞానముత్తమం
యజ్జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః
జ్ఞానార్జనమున మహనీయులైన ఋషీశ్వరులు మోక్షమును
పొందిరి. అట్టి అహత్తరమైన జ్ఞానమును నీకు ఉపదేశించుచున్నాను.
078 సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః
తాసాం బ్రహ్మ మహద్యోనిరహం బీజప్రదః పితా
అర్జునా! ప్రపంచమున జన్మించు ఎల్ల చరాచర
సమూహములకు ప్రకృతి తల్లి వంటిది. నేను తండ్రి వంటివాడను.
079 తత్ర సత్త్వం నిర్మలత్వాత్ప్రకాశకమనామయం సుఖసఙ్గేన బధ్నాతి
జ్ఞానసఙ్గేన చానఘ
అర్జునా!
త్రిగుణములలో సత్త్వగుణము నిర్మలమగుటంజేసి సుఖ
జ్ఞానాభి లాషలచేత ఆత్మను దేహమునందు బంధించుచున్నది.
080 రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసఙ్గసముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ
కర్మసఙ్గేన దేహినం
ఓ కౌంతేయా!
రజోగుణము కోరికలయందు అభిమానమూ,
అనురాగమూ పుట్టించి ఆత్మను బంధించుచున్నది.
081 తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం
ప్రమాదాలస్యనిద్రాభిస్తన్నిబధ్నాతి భారత
అర్జునా!
అజ్ఞానమువలన పుట్టునది తమోగుణము. అది సర్వ ప్రాణులనూ మోహింపజేయునది.
ఆ గుణము మనుజుని ఆలస్యముతోనూ,
అజాగ్రత్తతోనూ, నిద్ర తోనూ బద్ధుని చేయును.
082 మానాపమానయోస్తుల్యస్తుల్యో
మిత్రారిపక్షయోః సర్వారంభపరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే
మానావ మానములయందు,
శత్రుమిత్రులయందు సమమైన మనస్సు గలవానిని త్రిగుణాతీతుడందురు.
083 ఊర్ధ్వమూలమధఃశాఖమశ్వత్థం ప్రాహురవ్యయం
చ్హందాఁసి యస్య పర్ణాని యస్తఁ వేద స వేదవిత్
బ్రహ్మమే మూలముగా, నికృష్ణమైన అహంకారము కొమ్మలుగాగల అశ్వత్థ వృక్షము
అనాది అయినది. అట్టి సంసార వృక్షమునకు వేదములు
ఆకులువంటివి. అట్టి దాని నెరింగినవాడే వేదార్థ సార మెరింగినవాడు.
084 న తద్భాసయతే సూర్యో న శశాఙ్కో న పావకః
యద్గత్వా న నివర్తఁతే తద్ధామ పరమం మమ
పునరావృత్తి రహితమైన మోక్షపథము,
సూర్య చంద్రాగ్నుల ప్రకాశమున కతీతమై, నా ఉత్తమ పథమై యున్నది.
085 అహఁ వైశ్వానరో భూత్వా ప్రాణినాఁ దేహమాశ్రితః
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నఁ చతుర్విధం
దేహులందు జఠరాగ్ని స్వరూపుడనై వారు భుజించు భక్ష్య,
భోజ్య, చోష్య, లేహ్య పదార్థముల జీర్ణము చేయుచున్నాను.
086 తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీమభిజాతస్య
భారత
దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానఁ
చాభిజాతస్య పార్థ సంపదమాసురీం
పార్థా! సాహసము, ఓర్పు, ధైర్యము,
శుద్ధి, ఇతరుల వంచింపకుండుట, కావరము లేకయుండుట,
మొదలగు గుణములు దైవాంశ సంభూతులకుండును. అట్లే, దంబము, గర్వము, అభిమానము,
క్రోధము, కఠినపు మాటలాడుట,
అవివేకము మొదలగు గుణములు రాక్షసాంశ సంభూతులకుండును.
087 త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః
క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్
కామ, క్రోధ, లోభములు ఆత్మను నాశనము చేయును.
అవి నరక ప్రాప్తికి హేతువులు కావున వానిని వదిలి వేయ వలయును.
088 యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న
సుఖం న పరాం గతిం
శాస్త్ర విషయముల ననుసరింపక ఇచ్చా మార్గమున
ప్రవర్తించువాడు సుఖ సిద్ధులను పొందజాలడు. పరమపదము నందజాలడు.
089 త్రివిధా భవతి శ్రద్ధా దేహినాఁ సా స్వభావజా
సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాఁ శృణు
జీవులకు గల శ్రద్ధ పూర్వ జన్మ వాసనా బలము వలన లభ్యము.
అది రాజసము, సాత్త్వికము, తామసములని మూడు విధములగా ఉన్నది.
090 యజంతే సాత్త్వికా దేవాన్యక్షరక్షాఁసి రాజసాః
ప్రేతాంభూతగణాఁశ్చాన్యే యజంతే తామసా జనాః
సత్త్వగుణులు దేవతలను, రజోగుణులు యక్ష రాక్షసులను,
తమోగుణులు భూత ప్రేత గణంబులను శ్రద్ధా భక్తులతో పూజించుదురు.
091 అనుద్వేగకరం వాక్యఁ సత్యం ప్రియహితఁ చ యత్
స్వాధ్యాయాభ్యసనఁ చైవ వాఙ్మయం తప ఉచ్యతే
ఇతరుల మనస్సుల నొప్పింపనిదియూ, ప్రియమూ,
హితములతో కూడిన సత్య భాషణమూ,
వేదాధ్యన మొనర్చుట వాచక తపస్సని చెప్పబడును.
092 కామ్యానాఁ కర్మణాఁ న్యాసం సఁన్యాసం కవయో విదుః
సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః
జ్యోతిష్ఠోమాది కర్మల నాచరింపకుండుట సన్యాసమనియూ,
కర్మఫలము ఈశ్వరార్పణ మొనర్చుట త్యాగమనియూ పెద్దలు చెప్పుదురు.
093 అనిష్టమిష్టం మిశ్రఁ చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య
న తు సఁన్యాసినాఁ క్వచిత్
కర్మఫలములు ప్రియములూ, అప్రియములూ,
ప్రియాతిప్రియములూ అని మూడు విధములు.
కర్మఫలమునలు కోరినవారు జన్మాంతరమందు ఆ ఫలములను
పొందుచున్నారు. కోరనివారు ఆ ఫలములను జన్మాంతరమున పొందజాల కున్నారు.
094 ప్రవృత్తిఁ చ నివృత్తిఁ చ కార్యాకార్యే భయాభయే బంధం
మోక్షఁ చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్త్వికీ
అర్జునా! కర్మ మోక్ష మార్గముల, కర్తవ్య భయాభయముల,
బంధ మోక్షముల ఏ జ్ఞానమెరుగుచున్నదో అది సత్త్వగుణ సముద్భవమని ఎరుగుము.
095 ఈశ్వరః సర్వభూతానాఁ హృద్దేశేర్జున తిష్ఠతి
భ్రామయన్సర్వభూతాని యంత్రారూఢాని మాయయా
ఈశ్వరుడు యెల్ల భూతములకు నియామకుడై, ప్రాణుల హృదయమందున్నవాడై,
జంత్రగాడు బొమ్మలనాడించు రీతిగా ప్రాణుల భ్రమింపజేయుచున్నాడు.
096 సర్వధర్మాంపరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం
త్వాం సర్వపాపేభ్యో మోక్ష్యయిష్యామి మా శుచః
సమస్త కర్మలను నాకర్పించి, నన్నే శరణు బొందిన,
ఎల్ల పాపములనుండి నిన్ను విముక్తుని గావింతును. నీవు చింతింపకుము.
097 య ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి
భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్యసఁశయః
ఎవడు పరమోత్కృష్టమైన,
పరమ రహస్యమైన ఈ గీతాశాస్త్రమును నా భక్తుల
కుపదేశము చేయుచున్నాడో, వాడు మోక్షమున కర్హుడు.
098 కచ్చిదేతచ్చ్హ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞానసంమోహః
ప్రనష్టస్తే ధనఁజయ
ధనంజయా!
పరమ గోప్యమైన యీ గీతా శాస్త్రమును చక్కగా
వింటివా? నీ యజ్ఞాన జనితమైన అవివేకము నశించినదా? కృష్ణా!
099 నష్టో మోహః స్మృతిర్లబ్ధా
త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గతసఁదేహః కరిష్యే వచనం తవ
అచ్యుతా! నా అవివేకము నీ దయ వలన తొలగెను.
నాకు సుజ్ఞానము లభించినది.
నాకు సందేహములన్నియూ తొలగినవి. నీ ఆజ్ఞను శిరసావహించెదను.
100 యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః
తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ
యోగీశ్వరుడగు శ్రీకృష్ణుడు,
ధనుర్ధారియగు అర్జునుడు యెచటనుందురో అచట సంపద, విజయము, ఐశ్వర్యము,
స్థిరమగు నీతియుండును.
గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ త్రయతత్కుమాన్ విష్ణొపద మవాప్నోతి భయ
శోకాది వర్జితః గీతాశాస్త్రమును ఎవరు పఠింతురో వారు
భయ శోకాది వర్జితులై విష్ణు సాయుజ్యమును పొందుదురు.

దేశించిన గుణత్రయ విభాగ, పురుషోత్తమ ప్రాప్తి,
దేవాసుర సంపద్విభాగ, శ్రద్ధాత్రయ విభాగ,
మోక్షసన్యాస యోగములు సర్వమూ సమాప్తము.
ఓం సర్వేజనా సుఖినో భవంతు
సమస్త సన్మగళాని భవంతు
అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయ
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః

Credits
Writer(s): K S Rangiah Sastry/traditional
Lyrics powered by www.musixmatch.com
Link
Altri album
- Nenu Puttanu (Trap Beats) - Single
- Manasu Gathi Inthe (Trap Beats) - Single
- Himagiri Sogasulu Muripinchunu (Retro Lofi) - Single
- Kalavara Maaye (Chill HipHop Mix) - Single
- Oh Devadaa (From "Devadasu") [Drill Mix] - Single
- Chitapata Chinukulu (From "Aathma Balam") [Chill Hip Hop Mix]
- Chethilo Cheyyesi (From "Dasara Bullodu") [Retro Lofi] - Single
- Chanduruni Minchu (From "Raktha Sambandham") [Retro Lofi] - Single
- Jagame Maya (From "Devadasu") [Retro Lofi] - Single
- Kalavaramaaye Madhilo (From "Pathala Bhairavi") - Single [Drill Mix] - Single
© 2024 All rights reserved. Rockol.com S.r.l. Website image policy
Rockol
- Rockol only uses images and photos made available for promotional purposes (“for press use”) by record companies, artist managements and p.r. agencies.
- Said images are used to exert a right to report and a finality of the criticism, in a degraded mode compliant to copyright laws, and exclusively inclosed in our own informative content.
- Only non-exclusive images addressed to newspaper use and, in general, copyright-free are accepted.
- Live photos are published when licensed by photographers whose copyright is quoted.
- Rockol is available to pay the right holder a fair fee should a published image’s author be unknown at the time of publishing.
Feedback
Please immediately report the presence of images possibly not compliant with the above cases so as to quickly verify an improper use: where confirmed, we would immediately proceed to their removal.