Nuvvante Na Navvu (From "Krishnagadi Veera Prema Gaadha")

నువ్వంటే నా నవ్వు .
నేనంటే నే నువ్వు .
నువ్వంటూ నేనంటూ లేమనీ .
అవునంటూ మాటివ్వు .
నిజమంటూ నే నువ్వు .
నే రాని దూరాల్ని నువ్ పోనని .
ఎటు ఉన్నా నీ నడక .
వస్తాగా నీ వెనక .
దగ్గరగా రానీను దూరమే .
నే వేసే ప్రతి అడుగు .
ఎక్కడికో నువ్ అడుగు .
నిలుచున్నా నీ వైపే చేరేనులే .
నీ అడుగేమో పడి నేల గుడి అయినదే .
నీ చూపేమో సడిలేని ఉరుమయినదే.
నువ్వు ఆకాశం నేను నీకోసం .
తడిసిపోదామా ఈ వానలో .

ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే.
సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయే.
నీడల్లో నలుపల్లే మల్లెల్లో తెలుపల్లే .
ఈ భువికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమా.
ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే.
సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయే.
నీడల్లో నలుపల్లే మల్లెల్లో తెలుపల్లే .
ఈ భువికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమా.

నే ఇటు వస్తాననుకోలేదా.
తలుపస్సలు తీయవు తడితే .
పో పసివాడని జాలే పడితే .
బుగ్గన ముద్దిచ్చి చంపేసావే.
నువ్వూ నేనంటూ పలికే పదముల్లో.
అధరాలు తగిలేనా కలిసే వున్నా.
మనమంటూ పాడు పెదవుల్లో చూడు .
క్షణమైనా విడిపోవులే.
ఇది ఓ వేదం పద రుజువవుదాం .
అంతులేని ప్రేమకే మనం .
నివురు తొలగేలా నిజము గెలిచేలా.
మౌనమే మాట మార్చేసినా .

నువ్ నవ్వేటి కోపానివే.
మనసతికిన ఓ రాయివే .
నువ్ కలిసొచ్చే శాపానివే .
నీరల్లే మారేటి రూపానివే .
నచ్చే దారుల్లో నడిచే నదులైనా .
కాదన్నా కలవాలి సంద్రములోన .
విడివిడిగా వున్నా విడిపోలేకున్నా.
ప్రవహించే ప్రణయం ఇదే .
వొద్దన్నా తిరిగేటి భువిమీదొట్టు.
నా ప్రాణం తిరిగేనే ఇక నీ చుట్టూ.
నాలోనే నువ్వుంటూ నీతోనే నేనంటూ .
ఈ భువిలో విహరించే వెలుగే మన ప్రేమా.



Credits
Writer(s): Krishna Kanth, Vishal Chandrashekar
Lyrics powered by www.musixmatch.com

Link