Maattekki Thooge

మత్తెక్కి తూగే మనసా... ఏమైందో ఏమో తెలుసా
వేధిస్తావేంటే వయసా... నీక్కూడా నేనే అలుసా
తానేదో చెయ్యి జారి తాకెనే ఒక్క సారి
ఆ మత్తె నన్ను చేరి అల్లింది హద్దు మీరి... నాకే దారి
మత్తెక్కి తూగే మనసా... ఏమైందో ఏమో తెలుసా
వేడెక్కి వేగె వయసా... చిత్రంగా ఉందీ వరస

మొత్తం తలుపులే మూసినా ఏకాంతమే లేదే
నిజం తెలిసినా నమ్మవే నువ్వే ఒంటిగా లేవే
అర్ధం అదే అన్నదీ అర్ధం ఏమై ఉంటది
నిత్యం నీలో ఉన్నది నేనే కదా అన్నది
కనివిని ఎరుగనిదీ గొడవ
మత్తెక్కి తూగే మనసా ఏమైందో ఏమో తెలుసా
వేడెక్కి వేగె వయసా చిత్రంగా ఉందీ వరస

వేలే తగిలితే ఒళ్ళిలా వీణై పలుకుతుందా
గాలే తడిమితే ఇంతలా ప్రాణం ఉలుకుతుందా
వీచే గాలే నీవై విచ్చేసావే వెచ్చగా
విచ్చే పువ్వు నీవై ఇచ్చేస్తావా వాలుగా
చిలిపిగా చిడుముకుపో త్వరగా
మత్తెక్కి తూగే మనసా... ఏమైందో ఏమో తెలుసా
వేడెక్కి వేగె వయసా... చిత్రంగా ఉందీ వరస
తానేదో చెయ్యి జారి తాకెనే ఒక్క సారి
ఆ మత్తె నన్ను చేరి అల్లింది హద్దు మీరి... నాకే దారి
మత్తెక్కి తూగే మనసా
వేడెక్కి వేగె వయసా



Credits
Writer(s): Mani Sharma, Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link