Devude Ichchadu

మ్మ్ మ్మ్
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
ఇక ఊరేల సొంత ఇల్లేల
ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం

నన్నడిగి తలిదండ్రి కన్నారా ఆ ఆ ఆ
నన్నడిగి తలిదండ్రి కన్నారా నా పిల్లలే నన్నడిగి పుట్టారా
పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మా
నారు పోసి నీరు పోసే నాధుడు వాడమ్మా
ఏది నీది ఏది నాది ఈ వేదాలు ఉత్త వాదాలే ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి

శిలలేని గుడికేల నైవేద్యం ఈ కలలోని సిరికేల నీ సంబరం
ముళ్ళ చెట్టుకు చుట్టూ కంచే ఎందుకు పిచ్చెమ్మ
కళ్ళులేని కభోది చేతి దీపం నీవమ్మా
తొలుత ఇల్లు తుదకు మన్ను ఈ బ్రతుకెంత దాని విలువెంత ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం

తెలిసేట్లు చెప్పేది సిద్ధాంతం అది తెలియకపోతేనే వేదాంతం
మన్నులోన మాణిక్యాన్ని వెతికే వెర్రెమ్మా నిన్ను నువ్వే తెలుసుకుంటే చాలును పోవమ్మా
ఏది సత్యం ఏది నిత్యం ఈ మమకారం ఒట్టి అహంకారం ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి



Credits
Writer(s): Athreya, M. S. Viswanathan
Lyrics powered by www.musixmatch.com

Link