Oh Sakhi Oho Sakhi Cheli

ఓ దివ్య రమణులారా
నేటికి కనికరించినారా
కలకాదు కదా సఖులారా
ఓ సఖీ ఓహో చెలీ ఓహో మదీయ మోహినీ
ఓ సఖీ ఓహో చెలీ ఓహో మదీయ మోహినీ ఓ సఖి

కలలోపల కనిపించి వలపించిన చెలులోహో
కలలోపల కనిపించి వలపించిన చెలులోహో
కనులవిందు చేశారే
కనుల విందు చేశారిక ధన్యుడనైతిని నేనహా
ఓ సఖీ ఓహో చెలీ ఓహో మదీయ మోహినీ ఓ సఖీ

నయగారము లొలికించి
ప్రియరాగము పలికించి
నయగారము లొలికించి ప్రియరాగము పలికించి హాయి నొసగు ప్రియలేలే
హాయి నొసగు ప్రియలే మరి మాయలు సిగ్గులు ఏలనె
ఓ సఖీ ఓహో చెలీ ఓహో మదీయ మోహినీ ఓ సఖీ

కనుచూపులు ఒకవైపు మనసేమో నా వైపు
కనుచూపులు ఒకవైపు మనసేమో నా వైపు ఆటలహో తెలిసేనులే
ఆటలహో తెలిసెను చెలగాటమయ నా కడ చెల్లునె
ఓ సఖీ ఓహో చెలీ ఓహో మదీయ మోహినీ

సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు



Credits
Writer(s): Pingali, Pendyalaya Nageswara Rao
Lyrics powered by www.musixmatch.com

Link