Kaadhani Nuvvantunnadhi

కాదని నువ్వంటున్నది
అవునని వినిపిస్తున్నది నిజమేనా
ఓ కాదని నువ్వంటున్నది
అవునని వినిపిస్తున్నది నిజమేనా
ఏమో ఏమన్నానో
ఏమో ఏం విన్నానో
ఏం కావాలంటున్నది
అటు ఇటు ఊగే
నీ మది తెలిసేనా

ఏం కావాలంటున్నది
అటు ఇటు ఊగే
నీ మది తెలిసేనా
ఏమో ఏం కావాలో
తనకి తెలుసో లేదో
ఏమో ఏం కావాలో
తనకి తెలుసో లేదో
కోరే వరమేదో మునుముందే నిలుచుందే
ఇంకా కలలేనా కనుపాపా
చేరే దరి ఏదో రమ్మంటూ ఎదురైతే
చూస్తూ నిలుచోదే తెరచాప
పారాడే పసిపాపవా ప్రాయం రాలేదా
అడుగేస్తే పడిపోతావా పడవే ముందడుగా
ముందు వెనకా చూడక పడిపోమంటావా
నువ్వు చూపిందే తోవంటూ
తరిమే దుందుడుకా

ఏమో ఏం కావాలో
తనకి తెలుసో లేదో
ఏమో ఏం కావాలో
తనకి తెలుసో లేదో
నీలో నీతోనే దోబూచి దొంగాట
నీకే నువ్వు దొరికేదెపుడంటా
ఆటో వేటో తేలనీ
మన ఈ చెలగాట
ఆలోచిద్దాం అందాక తప్పేం లేదంటా
కవ్వించే కయ్యాలతో నెగ్గదు చెలిమాటా
ఓటమినే గెలుపంటుంది మనసుల ముద్దాటా
అవునా అంతేనేమో
అయినా ఇంతేనేమో
అవునా అంతేనేమో
అయినా ఇంతేనేమో
ఓ కాదని నువ్వంటున్నది
అవునని వినిపిస్తున్నది నిజమేనా ఓ

ఓ ఏం కావాలంటున్నది
అటు ఇటు ఊగే
నీ మది తెలిసేనా

ఏమో ఏమో ఏమన్నానో ఏమన్నావో
ఏమో ఏమో ఏం విన్నావో ఏం విన్నానో
ఏమో ఏమన్నానో
ఏమో ఏం విన్నావో ఏమో



Credits
Writer(s): Sirivennela Seetha Rama Shastry
Lyrics powered by www.musixmatch.com

Link