Andam Hindolam (From "Supreme")

అందం హిందోళం అధరం తాంబూలం
అసలే చలికాలం తగిలే సుమ బాణం
సంధ్యా రాగాలెన్నో
పెదవులు తాకిన వేళా
ఒళ్ళో మెత్తని మన్మధ ఒత్తిడి
సాగిన వేళా
అందనది అందాలనిది అందగనే సందేలకది
నా శృతి మించెను
నీ లయ పెంచెనులే హో
చలిలో దుప్పటి కెక్కిన
ముద్దుల పంటలలో
తొలిగా ముచ్చెమటారని ఉక్కిరి గుంటలలో
దుమ్మెత్తే కొమ్మమీద గుమ్మల్లే కాయగా
పైటమ్మే మానుకుంది పరువాలే దాయగా
ఉసిగొలిపే రుచి తెలిపే
తొలి వలపే హా
మోటిమలపై మొక మెరుపై
జత కలిపే హా
తీయనిది తెర తీయనిది
తీరా అది చేజిక్కినది
మొగ్గలు విచ్చెను బుగ్గలు పిండగనే హో
అందం హిందోళం హ హః
అధరం తాంబూలం హ హః
అసలే చలి కాలం త తర
తగిలే సుమ బాణం

వలపే హత్తుకు పోయిన
కౌగిలి అంచులలో
వయసే జివ్వున లాగిన
వెన్నెల మంచులలో
గిచ్చుల్లా వీణ మీద
మృదులెన్నో పాడనా
చిచ్చుల్లా హాయి మీద
నిదరంతా మాయగా
తొలి ఉడుకే ఒడిదుడుకై
చలి చినుకై హా
పెనవేసి పెదవడిగే ప్రేమలకు హే
ఇచ్చినది కడు నచ్చినది
రేపంటే నను గిచ్చినది
అక్కర కొచ్చిన చక్కని సోయగమే హే
అందం హిందోళం హ హః
అధరం తాంబూలం హ హః
అసలే చలికాలం హ హః
తగిలే సుమ బాణం హ హః



Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, S R Koteswara Rao, T. V. Somaraju, Sai Kartheek
Lyrics powered by www.musixmatch.com

Link