Naa Manasuney - From "Manmadhudu"

నా మనసునే మీటకే నేస్తమా
నా దారిలో చేరకే చైత్రమా
సరదాల చిలిపి తనమా
చిరునవ్వులోని స్వరమా
నా తలుపు తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమా
నా మనసునే మీటకే నేస్తమా
నా దారిలో చేరకే చైత్రమా

నాకెందుకిలా అవుతోంది చెప్పవా ఒక్కసారి
నీ వెంటపడే ఆశలకి చూపవా పూల దారి
చినుకల్లే చేరి వరదల్లే మారి ముంచేస్తే తేలేదెలాగ
తడిజాడ లేని తమ గుండెలోని దాహాలు తీరేదెలాగ
లేనిపోని సయ్యాటతో వెంటాడకే ప్రేమా
నీ కనులలో వెలగనీ ప్రియతమా
నీ పెదవికి తెలుపనీ మధురిమా

నీ ఊహలలో కొంటెతనం పలకరిస్తోంది నన్ను
నీ ఊపిరితో అల్లుకుని పులకరిస్తోంది వెన్ను
అలవాటుపడిన ఎద చీకటింట సరికొత్త వేకువై రావా
కిరణాలు పడని తెరచాటులోని ఏకాంతమే వదులుకోవా
నన్ను నేను మరిచేంతలా మురిపించకే ప్రేమా
నీ కనులలో వెలగనీ ప్రియతమా
నీ పెదవికి తెలుపనీ మధురిమా
సరదాల చిలిపి తనమా
చిరునవ్వులోని స్వరమా
నా తలుపు తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమా



Credits
Writer(s): Devi Sri Prasad, Chembolu Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link