Enadana Anukunnana - From "Eduruleni Manishi"

ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా
ఇది ఈనాడైనా నిజమేనా కలగంటున్నానా
మనసుని మరి మరి అడగనా
నీ రాకతో నా మౌనం రాగాలు తీయగా
నీ నీడలో నా ప్రాణం మారాకు వేయగా
ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా
ఇది ఈనాడైనా నిజమేనా కలగంటున్నానా

నిసపా గమరి నిసపా
శిలలైనా చిగురించే చినుకంటి శ్రీమతీ
తొలిసారి తెలిసిందే చెలిమి సంగతీ
గగనాలే శిరసొంచే సుగుణాల పెన్నిధీ
వరమల్లే దొరికావే మంచి పెనిమిటీ
ఓ ప్రతి అణువు తెగబరువై నిన్ను వేడుకున్నది
జతపడుతూ సగమైతే ఎంత వేడుకన్నది
ఇన్నాళ్ళు ఇంతటి భారం అనిపించలేదుగా
నన్నేలు బంగరు ద్వారం కనిపించలేదుగా
ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా
ఇది ఈనాడైనా నిజమేనా కలగంటున్నానా
హృదయాంతరంగ శృంగారగంగ ప్రవహించె ప్రణయ పరవశంగా
మృధుశృంగ ధార మధురామృతాలే జతిమధన మధుర మిధునమంతా
వెలుగంటే పడదంటూ కసిరే కసిరేయిలో తొలిపొద్దై వెలిగావే ప్రేమబంధమా
వలపంటే విషమంటూ ఉలికిపడే గుండెలో అమృతమై కురిశావే ప్రణయమధురిమా
ఓ మెలకువనే కల అంటూ మూసుకున్న కళ్ళకీ
ఒంటరిగా పయనిస్తూ దారి తప్పు కాళ్ళకీ
సూర్యోదయం చూపావే నూరేళ్ళ కుంకుమా
నా తీరమై నిలిచావే నా ఇంటి దీపమా
ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా
ఇది ఈనాడైనా నిజమేనా కలగంటున్నానా
మనసుని మరి మరి అడగనా
నీ రాకతో నా మౌనం రాగాలు తీయగా
నీ నీడలో నా ప్రాణం మారాకు వేయగా

సాహిత్యం: సిరివెన్నెల: ఎదురు లేని మనిషి: ఎస్.ఎ.రాజ్ కుమార్: హరిహరన్, చిత్ర



Credits
Writer(s): Sirivennela Sitarama Sastry, S.a.raj Kumar
Lyrics powered by www.musixmatch.com

Link