Aravindam

అరవిందం అరవిందం అరవిచ్చేవేళ
ఆకాశ తీరాలు చేరుకుందాం
మకరందం మకరందం కురియంగ హృదయం
మమతానురాగాలే పంచుకుందాం
జాలువారే కాలాలె ఆగి
మౌనమాయే గుండె
జ్ఞాపకాల తీరాన కాసే
మంచు పూల ఎండే
ఎన్నెన్నో ఊసుల్ని కలబోసుకుంటూ
కన్నీళ్ళ కూది నే కలిసి తాగ
అయినా తని తీరంది ఈ జీవితం
అరవిందం అరవిందం అరవిచ్చేవేళ
ఆకాశ తీరాలు చేరుకుందాం
మకరందం మకరందం కురియంగ హృదయం
మమతానురాగాలే పంచుకుందాం

సాయం సంధ్యా రంగుల్లోన
నువ్వు నేను హరివిల్లౌదాం
వేసవిలోన వెన్నెల లాగ
కురిసే మురిసే విరిజల్లౌదాం
కాలాలే తరగని జతలో
లోకాలే ఎరగని శృతిలో
రాగంలా సాగింది మన జీవితం
అరవిందం అరవిందం అరవిచ్చేవేళ
ఆకాశ తీరాలు చేరుకుందాం
మకరందం మకరందం కురియంగ హృదయం
మమతానురాగాలే పంచుకుందాం

మొన్నటి మాటే నిన్నటి పాటై
స్వరమై వరమై వినిపించింది
కలిసిన చోటే కదిలిన బాటే
నీడై తోడై నడిపించింది
ప్రాణంగా మెలిగిన చెలిమి
జన్మంతా తరగని కలిమి
నువ్వంటే నేనైంది మన జీవితం
అరవిందం అరవిందం అరవిచ్చేవేళ
ఆకాశ తీరాలు చేరుకుందాం
మకరందం మకరందం కురియంగ హృదయం
మమతానురాగాలే పంచుకుందాం
జాలువారే కాలాలె ఆగి
మౌనమాయే గుండె
జ్ఞాపకాల తీరాన కాసే
మంచు పూల ఎండే
ఎన్నెన్నో ఊసుల్ని కలబోసుకుంటూ
కన్నీళ్ళ కూది నే కలిసి తాగ
అయినా తని తీరంది ఈ జీవితం



Credits
Writer(s): Vennalakanti, 4 Musics
Lyrics powered by www.musixmatch.com

Link