He Jyothiswaroopa

హే జ్యోతి స్వరూపా నారాయణా

కనులకు వెలుగువు నీవే కావా
కనులకు వెలుగువు నీవే కావా
కనబడు చీకటి మాయేకాదా
కనబడు చీకటి మాయేకాదా
నిను గనలేని ప్రాణి బ్రతుకే నిజముగ చీకటి యౌగా దేవా
కనులకు వెలుగువు నీవే కావా

పేరుకు నేను తల్లినెగానీ ఆదుకొనాలేనైతీ
పేరుకు నేను తల్లినెగానీ ఆదుకొనాలేనైతీ
పాలనుత్రాపీ ఆకలిబాపే
పాలనుత్రాపీ ఆకలిబాపే భాగ్యమునైనా నోచని నాకూ
ఏల జనించితివయ్యా నాకేల జనించితివయ్యా
నాకేల జనించితివయ్యా

అండగనుండా విధాతవీవూ
అండగనుండా విధాతవీవూ ఆకలిదప్పుల బాధేలేదు
నారాయణ నామామృత రసమే
నారాయణ నామామృత రసమే అన్నము పానముగావా దేవా

కనులకు వెలుగువు నీవే కావా
కనబడు చీకటి మాయేకాదా
నిను గనలేని ప్రాణి బ్రతుకే నిజముగ చీకటి యౌగా దేవా
కనులకు వెలుగువు నీవే కావా



Credits
Writer(s): Arudra, Kosaraju, Padmaraju, Samudrala, S Rajeswara Rao
Lyrics powered by www.musixmatch.com

Link