Arupu

పుట్టగానే ఏడ్చినప్పుడు తెలియలేదు
చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటానని

లోకం మొత్తం నాదే అసలు
నా లోపలె జీవం మొదలు
అయ్యా నేడే మీకే అలుసు
నా కోపమె మీకేం తెలుసు
పేగు పేగు నాతో కలిసి
నా నెత్తురె నీకే పంచి
పెంచా పెంచా నాపై దుమికే ఈ రాక్షసుల

అత్యాచారం చేసినోన్ని ఉరి తీయాలి
మెడ పట్టి గొంతు పిసికి కాలపెట్టాలి
నేను చెప్పేదంతా లోకం మొత్తం వినపడాలి
నీ చెల్లి కోసం ఏ రోజైనా నిలబడాలి
నేను పాడేది పాటనె కాదు చిన్నారి మాటల్లే ఇవి
కన్నులు కళ్ళార తడి కాపాడేదెవరు మరి
అమ్మాయిల వాకిళ్ళలోనే సంకెళ్లు బంధించి మరి
రంగుల ముగ్గుల పొడి రక్తంగ మారేనె పడి

Mummy నువ్వు ఇంట్లో వదిలేసి వెళితె
Uncle నా చెయ్యి పట్టి మీద మీద పడితే
ఏమని చెప్పను నేను ఎవ్వరికి చెప్పను నేను
మీరే మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని
ఎందుకు mummy పుట్టించాడు daddy నన్ను అసలు

వినాలనుకున్న నేను చందమామ కథలు
ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు
పుట్టగానే చంపేసుంటె తప్పుతుండె ఉసురు
చిన్న బట్టలేసుకుంటె చంపేయ్యాల?
ఇంకెన్ని రోజుల్ దాచుకుంట ప్రాణం ఇలా
నేను చదువుకోవాలా లేదా బడికెళ్లాలా
Newspaper main story అయిపోయానివాల

(చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి
మనిషనే రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయింది
ఎనిమిదేళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపినా ఘటన
మానవత్వానికి మాయని మచ్చగా మిగిలిపోయింది)

Village పిల్లాని collegeకెల్లాను
Distinction కొట్టేసి districtలు దాటాను
Cityకి రాగానే సీటీ లు కొట్టారు
నల్లగున్నానని నేను నవ్వులపాలయ్యాను
తల మీద చెయ్యివేసి దీవించె గురువులు
నడుం మీద చెయ్య వేసి కోరారు పరుపులు
జింక పిల్లలాగ నేను తీసాను పరుగులు
చనిపోయిన కూడా మీద పడ్డారు పురుగులు
ఎదో సాదిద్దామని classesకి వెళ్తే
ఓ వ్యక్తి love అంటూ నా వెంట పడెనె
చిన్నచూపు చూసి నా చున్నీ లాగాడు
Acid దాడుల్లో నా పేరెక్కించాడు
Road-u మీద rape చేసి రోకల్తో చంపారు
ఇది విన్న మా daddy గుక్కపెట్టి ఏడ్చాడు
Candle పట్టుకొని walking చేస్తారు
Candle ఆరిపోగానె ఇంటికెళ్ళిపోతారు

లోకం మొత్తం నాదే అసలు
నా లోపలె జీవం మొదలు
అయ్యా నేడే మీకే అలుసు
నా కోపమె మీకేం తెలుసు
పేగు పేగు నాతో కలిసి
నా నెత్తురె నీకే పంచి
పెంచా పెంచా నాపై దుమికే ఈ రాక్షసుల

ఒరేయ్ అన్నయ్యా నన్ను పెంచావుగా
నా పెళ్లి కోసం బరువులెన్నో మోసావుగా
ఇల్లు వదిలి ఇంటిపేరు మార్చారుగా
అయిన ఏడ్పు కూడా నవ్వుతోనే దాచానురా

అమెరికా సంబంధం అన్నారు మొదట్లొ
వెన్నంటే ఉంటాను అన్నాడు అప్పట్లొ
అనుమానం పెట్టేసి దాచాడు గుప్పెట్లొ
దెబ్బలన్ని కాచుకొని ఏడుస్త చీకట్లొ
Sorry అన్నయ్యా, అది oil మరక కాదు
Cigarette అని చెప్పాలంటే నాకు నోరు రాదు
కుంటుతున్న అంటే నేను కింద పడలేదు
కోడలనుకున్న కానీ పనిమనిషిని నేను
నా కాలే కట్టి గుడ్డ నోట్లో పెట్టి
కట్నం అంటూనె cricket bat తోటే కొట్టి
ఎవరు భాద్యులు కారు అని లెటరే రాసి
నా చేతిలో పెట్టి fan-uకి ఉరి వేశారు చేతులు దులిపేసారు

లోకం మొత్తం నాదే అసలు
నా లోపలె జీవం మొదలు
అయ్యా నేడే మీకే అలుసు
నా కోపమె మీకేం తెలుసు
పేగు పేగు నాతో కలిసి
నా నెత్తురె నీకే పంచి
పెంచా పెంచా నాపై దుమికే ఈ రాక్షసుల

భయపడి, తలదించి కాళ్ళమీద పడకు
(లోకం మొత్తం నాదే అసలు నా లోపలె జీవం మొదలు)
ఎగబడు, తన్ను వాన్ని బలిసిందారా బాడకౌ
(అయ్యా నేడే మీకే అలుసు నా కోపమె మీకేం తెలుసు)
Pant zip విప్పగానే మొగాడు కాదు
గల్లా పట్టి కొట్టుడు కొట్టు జోలికసల్ రాడు
(పేగు పేగు నాతో కలిసి నా నెత్తురె నీకే పంచి)

Roll Rida and kamran
We request you to be strong women
పెంచా పెంచా నాపై దుమికే ఈ రాక్షసుల
Stronger than all



Credits
Writer(s): Roll Rida, Krishna Kanth Gundagani, Syed Kamran
Lyrics powered by www.musixmatch.com

Link