Tholi Tholiga Tholakari

తొలి తొలిగా తొలకరి చూసిన పిల్లాన్నై
విప్పారిన కన్నులతో లోకాన్నె చూశా
ఇది వరకెప్పుడు తెలియని ఈ మాధుర్యం
ఇప్పుడిప్పుడీ సమయాన నీ వల్లనే చూశా

ఓ వట్టి మట్టి కుండీ
ప్రతి రోజు చూస్తువున్నా
అది చక్కని పూవులనెన్నో
ఇస్తుందని నీడే చూశా
హృదయంతో స్నేహం చేసే కళ్ళె
మనకోసం నిలిచే పాదం
మన భుజమే తట్టే చేయీ
ఎంతో ఎంతో అర్థం చూపించగా
ఎంతెంతో ఆనందం పొందానుగా
నీడలోని శిల్పం మెరిసకిలా
తీపి కంటి నీరు కురిసేనుగా

ఉప్పొంగే నడి సంద్రాన
ఆల్చిప్పను నే కనుగొన్న
లోలోపల ముత్యం ఉందని
సత్యాన్ని తెలుసుకున్న
అందంలో అందమే కాదు కదా
అందంలో అర్థము ఉంది కదా

తొలి తొలిగా తొలకరి చూసిన పిల్లాన్నై
విప్పారిన కన్నులతో లోకాన్నె చూశా
ఇది వరకెప్పుడు తెలియని ఈ మాధుర్యం
ఇప్పుడిప్పుడీ సమయాన నీ వల్లనే చూశా

ఈ జన్మకే కారణం ఏమిటంటు
తెలుసుకుంటు సాగనా
నేనే ఇక మరిచావ్ ఎలా ఇలా
నాకు కోపము తాపము మాయం చేసి నువ్విలాగా
గుండెలోన ప్రేమ నీరు పోసినవేల
అలజడుల ఉప్పెనవు నా జీవితన్నిలా
ఓ చల్లని గాలిలా నీ స్నేహం చేరిలా

ఎంతో ఎంతో అర్థం చూపించగా
ఎంతెంతో ఆనందం పొందానుగా
నీడలోని శిల్పం మెరిసకిలా
తీపి కంటి నీరు కురిసేనుగా

ఉప్పొంగే నడి సంద్రాన
ఆల్చిప్పను నే కనుగొన్న
లోలోపల ముత్యం ఉందని
సత్యాన్ని తెలుసుకున్న
అందంలో అందమే కాదు కదా
అందంలో అర్థము ఉంది కదా

తొలి తొలిగా తొలకరి చూసిన పిల్లాన్నై
విప్పారిన కన్నులతో లోకాన్నె చూశా
ఇది వరకెప్పుడు తెలియని ఈ మాధుర్యం
ఇప్పుడిప్పుడీ సమయాన నీ వల్లనే చూశా



Credits
Writer(s): Yuvan Raja, Sreshta Sreshta
Lyrics powered by www.musixmatch.com

Link