Raagamayi Raave

రాగమయీ రావే అనురాగమయీ రావే
రాగమయీ రావే అనురాగమయీ రావే రాగమయీ రావే
నీలాల గగనాన నిండిన వెన్నెల అ అ ఆ
నీలాల గగనాన నిండిన వెన్నెల నీ చిరునవ్వుల కలకలలాడగ
రాగమయీ రావే అనురాగమయీ రావే రాగమయీ రావే

చివురులు మేసిన చిన్నారి కోయిల మరిమరి మురిసే మాధురి నీవే
చివురులు మేసిన చిన్నారి కోయిల మరిమరి మురిసే మాధురి నీవే
తనువై మనసై నెలరాయనితో కలువలు కులికే సరసాలు నీవే
సరసాలు నీవే సరాగాలు నేనే
రాగమయీ రావే అనురాగమయీ రావే రాగమయీ రావే

సంజెలలో
సంజెలలో హాయిగ సాగే చల్లనిగాలిలో మరుమల్లెల విరజాజుల పరిమళమే నీవు
జిలుగే సింగారమైన చుక్క కన్నెలు అంబరాన అ అ అ
జిలుగే సింగారమైన చుక్క కన్నెలు అంబరాన
సంబరపడు చక్కిలిగింతల పరవశమే నేను నవ పరిమళమే నీవు
రావే రాగమయీ నా అనురాగమయీ
రావే రాగమయీ నా అనురాగమయీ

నీడజూసి నీవనుకొని పులకరింతునే
అలవికాని మమతలతో కలువరింతునే
నీ కోసమే ఆవేదన నీ రూపమే ఆలాపన
కన్నెలందరూ కలలు కనే అందాలన్నీ నీవే
నిన్నందుకొనీ మైమరచే ఆనందమంతా నేనే
రావే రాగమయీ నా అనురాగమయీ
రావే రాగమయీ నా అనురాగమయీ



Credits
Writer(s): Malladi Ramakrishna Sastry, Pendyalaya Nageswara Rao
Lyrics powered by www.musixmatch.com

Link