Nijamga Kothaga

ఇవ్వకుండా ఎలా దాచుకోడం
మనసు పడితే మనసే...
ఎంత కష్టం కదా ఆపుకోడం

అవునంతే అంతే మనసు
తనకేం కావాలో తెలుసు
తలకిందులుగా నువ్ తపస్సు
చేస్తున్నా ఆగదుగా
ప్రేమించే మించే వయస్సు
నిను ముంచే ముంచే సరస్సు

అది తెలిసి కూడా మనస్సు

పడకుండా ఉండదుగా

నిజంగా కొత్తగా ఉందే
ఇదంతా నచ్చుతూ ఉందే
నాలో నేను చూడని ఈ హాయి హాయీ ఆహ్
నా కళ్ళల్లోంచి ఆహ్
నా గుండెల్లోకి ఆహ్
నువ్వు దూకేసావే సూటిగా
ఆహా నా ఊహల్లోంచి ఆహ్
నా ఊపిరిలోకి ఆహ్
నువ్వచ్చేసావే పూర్తిగా

అవునంతే అంతే మనస్సు
తనకేం కావాలో తెలుసు

తలకిందులుగా నువ్ తపస్సు
చేస్తున్నా ఆగదుగా

ఇంతకాలంగా నీకెంత దగ్గరగా
కూర్చుండంగానే దూరంగానే ఉన్నట్టుండేదే

ఏంటి ఇవ్వాళ నీక్కాస్త దూరంగా
నిల్చుండంగానే నీ కౌగిట్లో ఉంటున్నట్టుందే
ఎప్పటినుంచో ప్రేమ నాలో దాక్కొని ఉందేమో

మొహమాటంతో నాకు నేనే ఆపేశానేమో
ఇదంతా ఏంటో ఏమో ప్రేమంటే ఇంతేనేమో
దాచాలని చుసిన ఆగాగదేమో ఆహ్

నా కళ్ళల్లోంచి ఆహ్
నా గుండెల్లోకి ఆహ్
నువ్వు దూకేసావే సూటిగా
ఆహా నా ఊహల్లోంచి ఆహ్
నా ఊపిరిలోకి ఆహ్
నువ్వచ్చేసావే పూర్తిగా
అవునంతే అంతే మనస్సు
తనకేం కావాలో తెలుసు
తలకిందులుగా నువ్వు తపస్సు
చేస్తున్నా ఆగదుగా
ప్రేమించే మించే వయస్సు
నిను ముంచే ముంచే సరస్సు
అది తెలిసి కూడా మనస్సు పడకుండా ఉండదుగా



Credits
Writer(s): Bhaskara Bhatla Ravi Kumar, B. Ajaneesh Loknath
Lyrics powered by www.musixmatch.com

Link