Dandaalayya Dandaalayya

పడమర కొండల్లో వాలిన సూరీడా
పగిలిన కోటలనే వదిలిన మారేడా
పడమర కొండల్లో వాలిన సూరీడా

పగిలిన కోటలనే వదిలిన మారేడా
తడిసిన కన్నుల్లో మళ్లీ ఉదయించి
కలలో దేవుడిలా కాపై ఉంటావా
నీ అడుగులకే మడుగులు ఒత్తే వాళ్ళం
నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా.
దండాలయ్యా దండాలయ్యా
మాతోనే నువ్వుండాలయ్యా
దండాలయ్యా దండాలయ్యా
మాతోనే నువ్వుండాలయ్యా

తమనేలే రాజును మోసే భాగ్యం కలిగిందనుకుంటు
ఈ బండల గుండెలు పొంగి పండగ అయిపోదా
తను చిందించే చెమటను తడిసే పుణ్యం దొరికిందనుకుంటు
పులకించిన ఈ నేలంతా పచ్చగ అయిపోదా.
నీ మాటే మా మాటయ్యా
నీ చూపే శాసనమయ్యా
మా రాజు నువ్వే తండ్రి నువ్వే కొడుకు నువ్వే
మా ఆయువు కూడా నీదయ్యా.
దండాలయ్యా దండాలయ్యా
మారాజై నువ్వుండాలయ్యా
దండాలయ్యా దండాలయ్యా
మారాజై నువ్వుండాలయ్యా



Credits
Lyrics powered by www.musixmatch.com

Link