Dheemaga

ధీమాగా ఎగిరెళ్ళాం నేలమ్మా
క్షేమంగా దిగివచ్చామం చూడమ్మా
సులువుగ నమ్మలేవు గానీ అడగవె చందమామని
జరిగిన సాహసాన్ని చూసి ఉంటె సాక్ష్యమిమ్మని

దాయి దాయని చేయి చాచినా
జాబిల్లి రాలేదుగా ఇలకొదిగి
సరె పోనీ అని మనమే వెళదాం పదా అని
రాదారి వేసాము ఆ రెంటికి
మెరుపుల హారాలే మా మెళ్ళోన వేసి పిలిచి
మిల మిలమని మురిసెను గగనం

ఆకశానికి సాగరానికి
ఈ దూరం ఏనాటికీ కరగనిదా
అన్న ఆలోచనే ఎదలో ఎగసే అలైనదా
రోదసికి సేతువుగ మారును కదా
చెదరని నమ్మకమే నేస్తమయి పయనమైతే
కనులెదురుగ కల నిలుచునుగా



Credits
Writer(s): Sirivennela Seetharama Sastry, Prashanth R. Vihari
Lyrics powered by www.musixmatch.com

Link