Entho Fun

స్వర్గమే నేలపై వాలినట్టు నింగిలోన
తారలే చేతిలోకి జారినట్టు గుండెలోన
పూలవాన కురిసినట్టుగా
ఎంతో fun
ఎంతో fun
నెమలికే పాటలే నేర్పినట్టు కోయిలమ్మ
కొమ్మపై కూచిపూడి ఆడినట్టు కొత్త కొత్త

స్వరములే పుట్టినట్టుగా
ఎంతో fun
ఎంతో fun
కాళిదాసు కావ్యము త్యాగరాయ గేయము
కలిపి మనసు పాడినట్టుగా
అందమైన ఊహలు అంతులేని ఆశలు
వాకిలంత ఒంపినట్టుగా

ఎంతో fun
ఎంతో fun

కళ్ళు కళ్ళు కలుపుకుంటూ
కలలు కలలు పంచుకుంటూ
కాలమంతా సాగిపోనీ
మోహమంతా కరిగిపోతూ
విరహమంతా విరిగిపోతూ

దూరమంతా చెరిగిపోని
రాతిరంటే కమ్మనైన కౌగిలింత పిలుపని
తెల్లవార్లు మేలుకోవడం
ఉదయమంటే తియ్యనైన ముద్దు మేలుకొలుపని
దొంగలాగ నిద్రపోవడం
ఎంతో fun

ఎంతో fun

రోజుకొక్క బొట్టు బిళ్లే
లెక్కపెడుతూ చిలిపి అద్దం
కొంటె నవ్వే నవ్వుతోంది
బైటికెళ్లే వేళ నువ్వే
పిలిచి ఇచ్చే వలపు ముద్దే
ఆయువేదో పెంచుతోంది
ఇంటికెళ్ళే వేళ అంటూ మల్లెపూల పరిమళం
మత్తు జల్లి గుర్తు చేయడం
ఇంటి బైట చిన్నదాని ఎదురు చూపు కళ్ళలో
కొత్త ఉత్సవాన్ని నింపడం
ఎంతో fun
ఎంతో fun



Credits
Writer(s): Devi Sri Prasad, P Girish
Lyrics powered by www.musixmatch.com

Link