Osey Osey - From "Julai"

ఓ లవ లవ లవ లవ లవ లవ
కోపగించుకోకే తేనె కళ్ల పాలకోవా
ఓ లవ లవ లవ లవ లవ లవ
మూతి ముడుచుకోకే మార్చి నెల్లో మల్లెపువ్వా
హేయ్ పోలిసోడి బండి siren లా
Ambulance గాడీ హారన్లా
Loud speaker ఏదో మింగావనేంతగా ఏందీ గోల
ప్రేమ పుండు మీద కారం పెట్టి
గుండె అంచుకేమో దారం కట్టి
ఇష్టమొచ్చినట్లు దాన్నే ఎగరెయ్యకే అలా ఇలా
ఒసేయ్ ఒసేయ్ నన్ను ఉరేసి ఎల్లిపోకే
ఒసేయ్ ఒసేయ్ నన్ను పారేసి పారిపోకే
(ఒసేయ్ ఒసేయ్ ఈడ్ని ఉరేసి ఎల్లిపోకే)
(ఒసేయ్ ఒసేయ్ ఈడ్ని పారేసి పారిపోకే)
ఓ లవ లవ లవ లవ లవ లవ
కోపగించుకోకే తేనె కళ్ల పాలకోవా

నువ్వెంటలేనిదే temple కెళితే తిట్టి పంపడా గాడే
నువ్వు తోడు లేనిదే pub కి పోతే నో ఎంట్రీ బోర్డే
Single గా నన్ను ఆ mirror చూస్తే error అంటూ తిడతాదే
నా సొంత నీడే నను పోల్చుకోలేక తికమక పడతాదే
ఉప్పులేని పప్పుచారులా, స్టెప్పులెయ్యని చిరంజీవిలా
నువ్వు లేకపోతే పిల్లా దిక్కే నాకు దక్కేదెలా
ఒసేయ్ ఒసేయ్ నన్ను ఉతికేసి ఆరేయ్ కే
ఒసేయ్ ఒసేయ్ నన్ను పిండేసి పారేయ్ కే
(ఒసేయ్ ఒసేయ్ ఈడ్ని ఉతికేసి ఆరేయ్ కే)
(ఒసేయ్ ఒసేయ్ ఈడ్ని పిండేసి పారేయ్ కే)

నువు క్రికెట్ ఆడితే ఒక్కో ticket లక్ష పెట్టి కొంటానే
నువ్వు out అవుట్ అంటే ఆ అంపైర్ పైనే కక్షే కడతానే
నీ నవ్వు కోసమై క్యూలో ఉండే కోటిమందిని నేనే
నువు ఏడిపించినా నిను నవ్వించే ఏకైక joker నే
మందు ఉందే heart fail కి
మందు ఉందే love fail కి
పండులా ఉన్నోడ్ని patient లా మార్చేయకే
ఒసేయ్ ఒసేయ్ నన్ను చింపేసి పారబొయ్యకే
ఒసేయ్ ఒసేయ్ నన్ను చంపేసి పాతరేయకే
(ఒసేయ్ ఒసేయ్ ఈడ్ని చింపేసి పారబొయ్యకే)
(ఒసేయ్ ఒసేయ్ ఈడ్ని చంపేసి పాతరేయకే



Credits
Writer(s): Sri Mani, Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link