Punnami Puvvai (From "Rudhramadevi")

పున్నమి పువ్వై వికసిస్తున్నా
వెన్నెల గువ్వై విహరిస్తున్నా
అరమరికలు మరచి
తెరమరుగుల చెరలను విడిచి
అదునిది అని తలచి
అదుపెరగని మురిపెము పిలిచి
మధుర భావనల సుధల వాహినిగ ఎగసిన హృదయముతో
పున్నమి పువ్వై వికసిస్తున్నా

వెన్నెల గువ్వై విహరిస్తున్నా

నేల పైకి దూకే తొలి వాన ఆటలా

నింగి అంచు తాకే అలలోని పాటలా
మౌనం ఆలపించే నవరాగము ఏదో
ప్రాణం ఆలకించే ఆహ్వానం ఏదో
కొండవాగులోని కొత్త అలజడిలో
గుండె పొంగుతున్న సందడిలో
బంధనాలు దాటి చిందులాడు ఒడిలో
కిందు మీదు లేని తొందరలో
నేనేనా నిజంగానా అనే భావం కలిగే
పున్నమి పువ్వై వికసిస్తున్నా

వెన్నెల గువ్వై విహరిస్తున్నా

సొంత సోయగాలి బరువైన మేనిలో

వింత సౌరభాలే చిలికించు శ్వాసలో
ఉయ్యాలూపు గాలి లే లెమ్మన్నదా
వయ్యారాల కేళి రా రామ్మన్నదా
ఇంత కాలమెన్ని సొంపులున్న శిల్పం
శిల వెనకనె దాగుందా
ఇప్పుడేదో వింత స్వప్ప సంకల్పం
ముని పిలుపుగ తగిలిందా
సంకోచాల సంకెళ్లన్ని తృటిలో కరిగి
పున్నమి పువ్వై వికసిస్తున్నా

వెన్నెల గువ్వై విహరిస్తున్నా
అరమరికలు మరచి
తెరమరుగుల చెరలను విడిచి
అదునిది అని తలచి
అదుపెరగని మురిపెము పిలిచి
మధుర భావనల సుధల వాహినిగ ఎగసిన హృదయముతో
పున్నమి పువ్వై వికసిస్తున్నా
వెన్నెల గువ్వై విహరిస్తున్నా



Credits
Writer(s): Ilayaraja, Seetharama Sasthri
Lyrics powered by www.musixmatch.com

Link