Pichaak

నా పేరు రాజ్
సదువుల తేజ్
మనకు B.techల ఉండంగ కొత్త కొత్త వంటలండి
దునియాకంత తినబెట్టి master chef అవ్వాలని కోరికుండే మస్తు ఆశలుండే
కాని నడిమిట్ల software కొలువచ్చి
కలలు మొత్తం చేసిందిరాబై
పిచ్చాక్
పిచ్చాక్
నా జిందగీ పిచ్చాక్
నా జిందగీ పిచ్చాక్
అరె అద్దాల మేడ office-u
అన్ల కూకున్న ప్రతి ఒక్క Face-u
Artificial నవ్వులే Boss-u
ఆ Scent Smell జేసే సత్యనాశు
నా జిందగీ డమ్ డపపప
నా జిందగీ పర పపపప
నా జిందగీ పిచ్చాక్
నా జిందగీ పిచ్చాక్
A.Cలో మస్తుగుండె సుట్టూత పోరిలుండె
High-tech హంగామా heat ఎక్కే Styles మామా
Weekendల Outingలు Pubuలల్ల Dancingలు
Cocktail Drinkingలు Without Breakingలు
జిందగీ పిచ్చాక్
నా జిందగీ పిచ్చాక్
షురూ అయ్యింది అస్సలైన Torture
అరె Project File చేసె Puncture
Google Motherని అడుక్కుంట Matter
Employee Of The Month నేను 8th Wonder
వెయ్యి రూపాయిల Couponయే దెచ్చి
Boss నవ్వుకుంట సేత్ల బెట్టగానే
ఏడ వాడాల్నో అర్థమే కాక
మడిచి వెనక జేబులో బెట్టుకున్న దాన్నే
నా జిందగీ పిచ్చాక్
నా జిందగీ పిచ్చాక్

ఎనిమిది గంటలున్న Duty బారా తేరా గంటలయింది
తెల్లారు పొద్దు పోడు Officeలోనే అయిపోతాంది
Google అమ్మ దయతోటి Error లేని Code చేస్తే
Testingవోడు Phoneల Code Efficent లేదా అని లొల్లి లొల్లి చేసిండు
దిమాకే కరాబ్ అయ్యింది బుర్ర గిర్రు గిర్రుమంది
ఒంట్ల మొత్తం సుర్రుమంది
పోరాబై నీ Job అద్దు ఎం అద్దు నువ్విచ్చే పైసలొద్దు నువుపెట్టే Torture అద్దు
జోరుతా ఒర్రుకుంట
చేతిల ఉన్న Smartphone ఇసిరి కొట్టేసిన
అరె Manager జాదూగాడు మల్లాస కంత్రీగాడు
మళ్ళ నవ్వుకుంట అచ్చి భుజం మీద చెయ్యేసి
Congratulations You Are Promoted
అని మళ్ళ మళ్ళ గాడు నన్ను హౌలగాన్ని చేసిండు
Cool చేసి కుర్చి మీద కూలగొట్టి పోయిండు
ఏమీ అర్థం కాక అయ్యవ్వ కాడికి పోయి
అవ్వ ఈ కొలువు నాతోనయితలేదే ఇదసబెడ్త
అగో గదేంది బిడ్డా గట్లంటవ్
ఇయ్యాళరేపు కొలువు లేకుంటే పిల్లనెవరు ఇత్తాండ్రా
పెళ్లి చేసుకో బిడ్డా అంతా సక్కగయితది
Confuseలనే నాకు పెళ్లి కూడ జేసిండ్రు
First Night పంచాయతి మూడో రోజే పెట్టిండ్రు
కొత్త మంచాన్ని ఏసి పెట్టిండ్రు పూలు పండ్లన్నీ తెచ్చి పెట్టిండ్రు
అరె అత్తర్లు Full జల్లిండ్రు నన్ను నూకేసి తలుపు బెట్టిండ్రు
మస్తు Excitement తోటి నేను అరె హుషారు ఎక్కి పోయినాను
సిగ్గు పడ్తున్న పెళ్ళాం చేత్ల Glass-u గుంజుకొని పాలు మొత్తం తాగినాను
మంచం కొట్లాట Start చేసినాను ముద్దు మురిపాల హోళి ఆడినాను
అంత మంచిగుంది అనుకుంటుండగానే గుండె గుబేలు మన్నదొక్కసారి
ఏమయిందన్నా
అన్నా ఏమయిందే
ఇంకేమయిందిరా భై
పిచ్చాక్ పిచ్చాక్
నా జిందగీ పిచ్చాక్
నా జిందగీ
పరేషాన్లో ఉండగానే Count తగ్గిపోయెనని Bomb పేల్చి కూసుండు Doctor
Matter అర్థమయిన పిల్ల Message కూడ పెట్టకుండ Jump అయింది మూసి పెళ్లి Shutter
నా జిందగీ బూజు పట్టి పోయింది
గుండెలో ఆశ పుచ్చు పట్టింది
Mindలో software పేలింది
పిచ్చాక్



Credits
Writer(s): Varikuppala Yadagiri
Lyrics powered by www.musixmatch.com

Link