Nannu Thaakirevvaro (From "Kodalu Pilla")

నన్ను తాకి ఎవ్వరో ఎవ్వరో యవ్వనాల నవ్వులో పువ్వులో

తడిమేను వొణికింది చలితో ఒక పెను వేడి రగిలింది మదిలో
నన్ను తాకి ఎవ్వరో ఎవ్వరో యవ్వనాల నవ్వులో పువ్వులో

నింగి నుండి దేవత దిగెనో పన్నీటి జల్లు చిలకరించెనో

చెలి పక్కన ఉంటే నే పరవశమౌతా
చెలి పక్కన ఉంటే నే పరవశమౌతా
ఈ చక్కని చుక్క చెక్కిలినొక్కుట ఏమో కల ఏమో ఆఆ
నన్ను తాకి ఎవ్వరో ఎవ్వరో యవ్వనాల నవ్వులో పువ్వులో

దేవలోక సుధలు తెచ్చెనో తన తేనెలాంటి మనసు కలిపెనో

ఆ మధువు తాగితే నా మనసు ఊగితే
ఆ మధువు తాగితే నా మనసు ఊగితే
ఈ మధుర మధుర మధుర భావమేమో వలపేమో ఆఆ
నన్ను తాకి ఎవ్వరో ఎవ్వరో యవ్వనాల నవ్వులో పువ్వులో
తడిమేను వొణికింది చలితో ఒక పెనువేడి రగిలింది మదిలో ఆఆ
నన్ను తాకి ఎవ్వరో ఎవ్వరో యవ్వనాల నవ్వులో పువ్వులో

సాహిత్యం: ఆరుద్ర

Credits
Writer(s): Arudra, G K Venkatesh
Lyrics powered by www.musixmatch.com

Link