Donda Pandu Lanti - From "Pellam Oorelthe"

దొండ పండు లాంటి పెదవే నీది
అబద్దం అంతా అబద్దం
దూదిపింజ లాంటి పదమే నీది
అబద్దం అంతా అబద్దం
పాల మీగడంటి నుదురే నీది
అబద్దం
పూల తీగ లాంటి నడుమే నీది
అబద్దం
నీ పైన నా ప్రేమ అబద్దమనకూ అనకూ అనకూ
దొండ పండు లాంటి పెదవే నీది
అబద్దం
దూదిపింజ లాంటి పదమే నీది
అబ్దం

రత్నలును చల్లేటి నవ్వేమొ నీది
అబద్దం
నిన్ను నవ్వుల్లో ముంచెత్తు బాధ్యత నాది
ఇది నిజం
ముత్యాలు రాలేటి మాటేమొ నీది
అబద్దం
నీ మాటకు ఊ కొట్టు ఉద్యోగం నాది
ఇది నిజం
నేలమీద ఉన్న దేవత నీవు
అబద్దం
నిన్ను నమ్ముకున్న దాసుణ్ణి నేను
ఇది నిజం
నువు పొగిడే ప్రతి పాట తీపి అబద్దం
నను మెప్పించాలనే తాపత్రయం గొప్ప వాస్తవం
దొండ పండు లాంటి పెదవే నీది
అబద్దం అంతా అబద్దం
దూదిపింజ లాంటి పదమే నీది
అబద్దం.అంతా అబద్దం

పాల సరసు లాంటి పైటేమో నీది
ఆ హ హ అబద్దం
నీ పైట మాటునున్న మనసేమొ నాది
ఆ ఇది నిజం
గోరింట పువ్వంటి చెయ్యేమొ నీది
అహ మళ్ళీ అబద్దం
నీ చేతిలోన ఉన్న బ్రతుకేమొ నాది
అహా ఇది నిజం
నీలాలు కొలువున్న కళ్ళేమొ నీవి
అబద్దం
నువ్వు కన్నెర్ర చేస్తేనే కన్నీరు నేను
ఇది నిజం
నీ పైన అనుమానం క్షణకాలం మన ఇద్దరి మధ్యన అనుభంధం కలకాలం

దొండ పండు లాంటి పెదవే నీది
లలా లలా
దూదిపింజ లాంటి పదమే నీది
పాల మీగడంటి నుదురే నీది
పూల తీగ లాంటి నడుమే నీది
నీ పైన నా ప్రేమ అబద్దమనకూ అనకూ
అనకూ

సాహిత్యం: చంద్రబోస్, హరిహరన్, కల్పన



Credits
Writer(s): Mani Sharma, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link