O Rani

ఓ రాణి
మహరాణి
ప్రియదర్శిని రసవర్షిణి రావే

ఈ రాణి
అలివేణి
నవరాగిణి యువమోహిని నీదే
సుధలా నా పెదవుల్లో ప్రవహించే
యదలా పైఎద మీద పవళించే
మధురభావనల మౌనగీతికలోనా

ఓ రాణి
మహరాణి
నవరాగిణి యువమోహిని నీదే

వేసవి చిగురాకునై
నీ గాలిలో డోలలూగానులే
ఆమని తొలి పూవునై
నీ ప్రేమకే పూజ చేశానులే
ఇన్నాళ్ల ఎడబాటులో ఒడిగట్టినా ఆశనై
ఎడబెట్టినా ఆశతో బిగబట్టి నాశ్వాసనై
ఎదురు చూచితిని ఎదను చాచితిని నీకై

ఈ రాణి
అలివేణి
ప్రియదర్శిని రసవర్షిణి రావే

వెన్నెలా కను గిన్నెలా
నీకోసమే నింపుకున్నానులే
వానలా తడి వీణలా
నీ పాటనే చల్లుకున్నానులే
ఇన్నాళ్ల విరహాగ్నిలో తడి ఆరినా ప్రేమనై
ఈనాటి ఈ హాయిలో తనువంత కర్పూరమై
కరిగిపోతిని కలిసిపోతిని నీలో

ఓ రాణి
మహరాణి
ప్రియదర్శిని రసవర్షిణి రావే

ఈ రాణి
అలివేణి
నవరాగిణి యువమోహిని నీదే
సుధలా నా పెదవుల్లో ప్రవహించే
యదలా పైఎద మీద పవళించే
మధురభావనల మౌనగీతికలోనా



Credits
Writer(s): Veturi Sundararama Murthy, Chakravarthy
Lyrics powered by www.musixmatch.com

Link