Nee Rupu Parani

నీ రూపు పారాణి దీపం కనుచూపు కల్యాణి రాగం
ఎదవాకిట ఎదురవ్వవే ఉదయాస్తమానాల క్రీనీడలో
నీ మాట మమతాభిషేకం చలిచూపు శృంగార దీపం
తృణ పుష్పమై పదమంటనా పదహారు కళలున్న పరువాలతో
నీ రూపు పారాణి దీపం

నీ నీల నయనాలు చూసి ఆ ఆ ఆ ఆకాశమే వేణువూదు
నీ వొంటి వైనాలు చూసి ఆ ఆ ఆ సెలయేటి అల వీణ మీటే
సంధ్యలలో రంగులయ్యే రాగమేదో వర్ణాలు పాడిందిలే
ఆకాశమే నా కావ్యమై నక్షత్రమే నా వాక్యమై సాగించనా భావగీతి
శ్రుతి చేసుకో జత చేసుకో ఈ జీవనాదాలు నీలో నాలో
నీ రూపు పారాణి దీపం కనుచూపు కల్యాణి రాగం
తృణ పుష్పమై పదమంటనా పదహారు కళలున్న పరువాలతో
నీ రూపు పారాణి దీపం

ముఖమైన పద్మాన వాలి ఆ ఆ ఆ భ్రమరాలు వేదాలు పాడే
స్వరమైన ప్రణయాన తేలి ఆ ఆ ఆ కురులెన్నో రాగాలు తీసే
సందిట్లో సంగమించే భావలేవో కావ్యాలు కావాలిలే
ఋతు రాజ్యమే నీ లీలగా అధరాలతో హృదయాలనే ముద్దాడుకోవాలిలే
వినువీధిలో సుమ ధూళిలో ఈ జన్మ గంధాలు సాగేవేళా
నీ మాట మమతాభిషేకం చలిచూపు శృంగార దీపం
ఎదవాకిట ఎదురవ్వవే ఉదయాస్తమానాల క్రీనీడలో
నీ మాట మమతాభిషేకం



Credits
Writer(s): Veturi Sundararama Murthy, Chakravarthy
Lyrics powered by www.musixmatch.com

Link