Nindu Aakashamantha Manasu

నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా
పండు వెన్నెలలాంటి చల్లని చూపుల రేడువయ్యా
ముచ్చటగా ఒక తాళి కట్టి
నింగికి నేలకు నిచ్చెన వేసిన దేవుడు నీవే, చిన్నరాయుడు నీవే

నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా
పండు వెన్నెలలాంటి చల్లని చూపుల రేడువయ్యా

గాలిలోన తేలే పరువాల పూలకొమ్మ
నేల వాలిపోగా చిగురింప చేసినావే
పసుపు తాడు మీద లోకానికున్న ప్రేమ
మనిషి మీద లేదు ఈ నీతికెవరు బ్రహ్మ
తప్పవురా హేలనలు, వేదనలే నీ హితులు
గుండెకు బండకు వారధి కట్టిన దేవుడి లీల, ఇది కాకుల గోల

నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా
పండు వెన్నెలలాంటి చల్లని చూపుల రేడువయ్యా

నీటిలోని చేప కన్నీరు ఎవరికెరుక
గూటిలోని చిలుక గుబులేదో ఎవరికెరుక
నుదుటి మీద రాత వేరెవరు మార్చగలరు
న్యాయమూర్తి నీవే తీర్పెవరు తీర్చగలరు
ఒంటరిది నీ పయనం, నిబ్బరమే నీకభయం
తప్పుకి ఒప్పుకి గంతలు కట్టిన దేవుడి లీల, ఇది కాకుల గోల

నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా
పండు వెన్నెలలాంటి చల్లని చూపుల రేడువయ్యా
ముచ్చటగా ఒక తాళి కట్టి
నింగికి నేలకు నిచ్చెన వేసిన దేవుడు నీవే, చిన్నరాయుడు నీవే

నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా
పండు వెన్నెలలాంటి చల్లని చూపుల రేడువయ్యా

Credits
Writer(s): Ilayaraja, Bhuvanachandra
Lyrics powered by www.musixmatch.com

Link