Paara Hushar

పారాహుషార్
పారాహుషార్
పారాహుషార్
పారాహుషార్

తూరుపమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ
తూరుపమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ
పారాహుషార్ పారాహుషార్

అంబారీ ఏనుగునెక్కి
అందాల మా యువరాజు
అంబారీ ఏనుగునెక్కి అందాల మా యువరాజు
ఊరేగుతు వచ్చేనమ్మా
పారాహుషార్
పారాహుషార్ పారాహుషార్

తుంటరి కన్నయ్య వీడు ఆగడాల అల్లరిచూడు
తూరుపమ్మా పారాహుషార్
దుందుడుకు దుండగీడు దిక్కుతోచనీడు చూడు
దక్షిణమ్మా పారాహుషార్
పాలూ పెరుగు ఉండనీడు పోకిరి గోపయ్య చూడు
పడమరమ్మా పారాహుషార్
జిత్తులెన్నో వేస్తాడమ్మా
జిత్తులెన్నో వేస్తాడమ్మా
దుత్తలు పడదోస్తాడమ్మా ఉత్తరమ్మా
ఉత్తరమ్మా పారాహుషార్
పారాహుషార్ పారాహుషార్

రేయిరంగు మేనివాడు వేయి నామాలవాడు
తూరుపమ్మా పారాహుషార్
ఏమూలన నక్కినాడో ఆనమాలు చిక్కనీడు
దక్షిణమ్మా పారాహుషార్

నోరారా రా, రా రారా అన్నా
మొరాయించుతున్నాడమ్మా
పడమరమ్మా పారాహుషార్
ముక్కుతాడు కోసెయ్యాలి ముట్టెపొగరు తీసెయ్యాలి
ముక్కుతాడు కోసెయ్యాలి ముట్టెపొగరు తీసెయ్యాలి
ఉత్తరమ్మా పారాహుషార్
పారాహుషార్ పారాహుషార్

నీలాటి రేవుకాడ నీల మేఘశ్యాముడు చూడ అమ్మో ఓయమ్మో
నీలాటి రేవుకాడ నీల మేఘశ్యాముడు చూడ
సల్లనైన ఏటినీరు సలసలమని మరిగిందమ్మా అమ్మో ఓయమ్మో
సెట్టుదిగని సిన్నోడమ్మా బెట్టు వదలకున్నాడమ్మా
సెట్టుదిగని సిన్నోడమ్మా బెట్టు వదలకున్నాడమ్మా
అమ్మమ్మో ఓయమ్మో
జట్టు కట్ట రమ్మంటుంటే పట్టు దొరకకున్నాడమ్మ
అమ్మో ఓయమ్మో
అమ్మమ్మో ఓయమ్మో

తూరుపమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ
తూరుపమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ
పారాహుషార్ పారాహుషార్
పారాహుషార్
పారాహుషార్



Credits
Writer(s): Sirivennala Seetharama Shastry, Ramesh Naidu
Lyrics powered by www.musixmatch.com

Link