Manase

మంత్ర మేదో వేసింది మత్తుమందు చల్లింది మాయచేసి పోయింది ఓ లాహిరి
మనసు మనసు కలిపింది ముగ్గులోకి దింపింది తాపమేదో రేపింది ఈ లాహిరి
ఆగేట్టు లేదుగాని ఈ అల్లరి ఊపింది ప్రేమ లాహిరి
ఏవైపు లాగుతుందో ఏమో మరి రమ్మంది కొంటె లాహిరి
ఎంతని చెప్పను వింతగ తాకిన అంతేలేని లాహిరి

ఓహొ హొ అలవాటే లేని ఆరాటం ఏంటయ్యో
ఈవేగం ఎటుపోతుందో ఏమో
ఓ హ్హో హ్హో పొరబాటే కానీ ఏం చేస్తాం లేవమ్మో
ఈ మైకం మననేరం కాదేమో
గుప్పెడంత గుండెల్లో ఉప్పెనంత సందళ్ళు గుప్పుమంటే గుట్టంత ఏంగానూ
చెప్పకుండా ఎన్నాళ్ళు నిప్పులాంటి ఒత్తిళ్ళు తట్టుకుంటదా చెప్పు నీ మేను
ఎలా మరీ ఏం చేయాలిఈ ఆవిరి
ఊపిరిలో తొలిప్రేమ తుఫానుగ వీచే వింత లాహిరి

మంత్ర మేదో వేసింది మత్తుమందు చల్లింది మాయచేసి పోయింది ఓ లాహిరి
మనసు మనసు కలిపింది ముగ్గులోకి దింపింది తాపమేదో రేపింది ఈ లాహిరి

ఓ హ్హొ హ్హొ యమ బాధే అయినా బాగానే ఉందమ్మో ఈ తాపం నీ కూడా తేలిసిమో

మంత్ర మేదో వేసింది మత్తుమందు చల్లింది మాయచేసి పోయింది ఓ లాహిరి
మనసు మనసు కలిపింది ముగ్గులోకి దింపింది తాపమేదో రేపింది ఈ లాహిరి
ఆగేట్టు లేదుగాని ఈ అల్లరి ఊపింది ప్రేమ లాహిరి
ఏవైపు లాగుతుందో ఏమో మరి రమ్మంది కొంటె లాహిరి
ఎంతని చెప్పను వింతగ తాకిన అంతేలేని లాహిరి

Credits
Writer(s): Kishan Kishan, Mahesh Manollasa
Lyrics powered by www.musixmatch.com

Link