Modalaudaam

మొదలౌదాం తొలిప్రేమగా
అపుడో ఇపుడో ఎపుడైతేనేం కొత్తగా
జతపడదాం ఒక జన్మగా
మన్లో ఎవరెవరెవరో మరపైపోయే కలయికగా

ఏ నిమిషం నిను చూసానో ఒక చూపులొ ప్రేమలో పడిపోయా
కన్నులు కన్నులు కలిసిన దారిలో నీ ఎదలో స్థిరపడిపోయా
ఏ నిమిషం నిను చూసానో ఒక చూపులొ ప్రేమలో పడిపోయా
రంగుల కలలను రెక్కలు తొడిగిన సీతాకోకయ్యా
ఆకలుండదే నా నిన్నే కంటిముందు చూస్తుంటే
నిద్దరుండదే నీ నవ్వే పూల బాణమేస్తుంటే
ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే
ఊపిరాడదే నీ నీడే చుట్టు పక్క లేకుంటే
హో నేను నేను కానులే
నువ్వు నువ్వు కావులే
మన ఇద్దరి ప్రతిరూపంగా కదిలిందీ ప్రేమే
ఆకలుండదే నా నిన్నే కంటిముందు చూస్తుంటే
నిద్దరుండదే నీ నవ్వే పూల బాణమేస్తుంటే
ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే
ఊపిరాడదే నీ నీడే చుట్టు పక్క లేకుంటే

హేయ్ నువ్వొచ్చి చేరగా
అదేంటో గాని నాలో నాకు కొంచెం కూడా చోటు లేదుగా
నా మనస్సుపై నీ పేరు వాలగా
మచ్చుకైన మాటకైన నాకు నేను గుర్తుకైన రానుగా
మనకు లేనే లేవుగా కల, నిజం రెండుగా
ప్రతీ జ్ఞాపకం అవదా అనగా అనగా కథగా
ఆకలుండదే నా నిన్నే కంటిముందు చూస్తుంటే
నిద్దరుండదే నీ నవ్వే పూల బాణమేస్తుంటే
ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే
ఊపిరాడదే నీ నీడే చుట్టు పక్క లేకుంటే

ఈ చిన్ని గుండెలో
నీ పైన ఉన్న ప్రేమను అంతా ఏ రూపంగా దాచనే చెలి
ఒక్క మాటలో, రెండక్షరాలలో
పెంచుకున్న అందమైన ఆనందాన్ని చెప్పలేనులే మరి
ఇద్దరొక్కటన్నది ఈ ప్రేమ వారధి
వందేళ్ళ బాటలో ప్రేమే మనకు అతిథి
ఆకలుండదే నా నిన్నే కంటిముందు చూస్తుంటే
నిద్దరుండదే నీ నవ్వే పూల బాణమేస్తుంటే
ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే
ఊపిరాడదే నీ నీడే చుట్టు పక్క లేకుంటే



Credits
Writer(s): Ramajogayya Sastry, Mickey J Meyer
Lyrics powered by www.musixmatch.com

Link